https://oktelugu.com/

Shah Rukh Khan- Rajamouli: రాజమౌళితో షారుఖ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ?

Shah Rukh Khan- Rajamouli: ‘బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ స్టార్స్ అంతా రాజమౌళికి వీరాభిమానులు గా మారారు. ఎలాగైనా రాజమౌళితో పని చేయాలనే ఉద్దేశ్యంతో.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను పిలిచి కథ చెప్పమని అడుగుతున్నారు. కథ చెప్పాక, బాగుంది, దీనికి రాజమౌళి అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని చివరకు రాజమౌళితో సినిమా అనే ప్రపోజల్ ను పెడతారు. గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇదే ప్లాన్ వేసి ఫెయిల్ అయ్యారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 07:45 AM IST
    Follow us on

    Shah Rukh Khan- Rajamouli: ‘బాహుబలి 2, ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ స్టార్స్ అంతా రాజమౌళికి వీరాభిమానులు గా మారారు. ఎలాగైనా రాజమౌళితో పని చేయాలనే ఉద్దేశ్యంతో.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను పిలిచి కథ చెప్పమని అడుగుతున్నారు. కథ చెప్పాక, బాగుంది, దీనికి రాజమౌళి అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని చివరకు రాజమౌళితో సినిమా అనే ప్రపోజల్ ను పెడతారు.

    Shah Rukh Khan- Rajamouli

    గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇదే ప్లాన్ వేసి ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని తెలిసి కూడా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఇదే ప్లాన్ లో ఉన్నాడు. రాజమౌళి సినిమాలు చూసి, ఆయన విజన్ కి షారుఖ్ ఫిదా అయిపోయారట. దేశంలో ఆయనలాంటి దర్శకుడు మరొకరు లేరు అంటూ షారుఖ్ ప్రస్తుతం ఫీల్ అవుతున్నాడు.

    Also Read: Bigg Boss OTT: టార్గెట్ బిందు.. చివరకు శివ కూడా అఖిల్ బ్యాచ్ తో కలిసిపోయాడా?

    ఇంతకుముందెప్పుడూ రాజమౌళి లాంటి డైరెక్టర్ ను తాను చూడలేదు అని షారుఖ్ పొగిడేస్తున్నాడు. మరి ఇంతగా షారుఖ్ ఖాన్.. జక్కన్నను పొగిడేస్తోంటే జనాలకు అనుమానం వస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రంలో తానే హీరోగా నటించాలని షారుఖ్ ఏమైనా ప్లాన్ చేశాడా ? అన్న డౌట్స్ వస్తున్నాయి.

    Shah Rukh Khan- Rajamouli

    రాజమౌళి గురించి షారుఖ్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. “నేను రాజమౌళి వర్క్ కి ఫిదా అయిపోయాను. నేను అవకాశాల కోసం దర్శకులను, హీరోలను పొగడను. కానీ, రాజమౌళి తీసిన అన్ని సినిమాలు చూశాను. ఆయన విజన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలని అనిపించింది. నేను ఎంత పెద్ద దర్శకుడినైనా పాత్రలు ఇవ్వమని రిక్వెస్ట్ చేయను’ అంటూ షారుఖ్ చెప్పుకొచ్చాడు.

    ఇలా చెబుతూనే ఒకవేళ రాజమౌళి నెక్స్ట్ మూవీలో నటించే ఛాన్స్ వస్తే.. ఎట్టిపరిస్థితుల్లో ఆ ఛాన్స్ ను మిస్ చేసుకోను అంటూ షారుఖ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళి – షారుఖ్ ఖాన్ కలయికలో భవిష్యత్తులో ఏమైనా సినిమా వస్తోందేమో చూడాలి.

    Also Read:Bugga Water Falls : వీడియో: ‘బుగ్గ’ జలపాత అందాలను బంధించిన ‘ఓకే తెలుగు’.. చూడతరమా?

    Recommended Videos:

    Tags