https://oktelugu.com/

ఉన్నట్టు ఉండి ఆ పోస్ట్ ఎందుకు చేసిందో ?

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షలకు బాగా దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఆ సినిమాలో లావణ్యను చూసిన చాలామంది కచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతొంది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది లావణ్య. ఆమెను తెలుగు ప్రేక్షకులు ఆదరించినా… మన స్టార్ హీరోలు మాత్రం పెద్దగా ఆదరించలేదు. అయినా అలుపుసొలుపూ లేకుండా దాదాపు దశాబ్దం నుండి వెండితెర పై స్టార్ డమ్ కోసం గ్లామర్ […]

Written By:
  • admin
  • , Updated On : September 25, 2020 / 03:29 PM IST
    Follow us on


    అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షలకు బాగా దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఆ సినిమాలో లావణ్యను చూసిన చాలామంది కచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతొంది అనుకున్నారు, కానీ అలా జరగలేదు. టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది లావణ్య. ఆమెను తెలుగు ప్రేక్షకులు ఆదరించినా… మన స్టార్ హీరోలు మాత్రం పెద్దగా ఆదరించలేదు. అయినా అలుపుసొలుపూ లేకుండా దాదాపు దశాబ్దం నుండి వెండితెర పై స్టార్ డమ్ కోసం గ్లామర్ డోస్ పెంచుతూనే పోతూ ఉంది లావణ్య. ఈ క్రమంలోనే భలె భలె మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలతో హిట్ అందుకున్నా లావణ్య ఫేట్ మాత్రం మారలేదు.

    Also Read: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చరిత్ర తెలుసా?

    అయితే తాజాగా సోషల్ మీడియాలో లావణ్య చేసిన ఒక పోస్ట్ కు నెటిజన్లు ఏదో తేడా కొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ లావణ్య ఏం పోస్ట్ చేసిందంటే.. ‘మనం మనలాగే ఉండాలి, లేదంటే ప్రపంచం మనల్ని తీసి అవతల పారేస్తుందంటూ ఓ కొటేషన్ తో పాటు ఒక వేళ మనమంత సేమ్‌గా ఉంటే ఈ ప్రపంచం మనల్ని బతకనివ్వదు.. అందుకే మీలా మీరు ఉండటం ఎన్నడూ ఆపకండి అంటూ పోస్ట్ చేసింది. మరి ఉన్నట్టు ఉండి లావణ్య ఇలా ఎందుకు పోస్ట్ చేసిందో అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇక ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్యా త్రిపాఠి అలరించనుంది.


    కాగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో లావణ్యది హాకీ క్రీడాకారిణి పాత్ర అని, అందుకే లావణ్య హాకీలో శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ హీరోగా వస్తోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో లావణ్య హ్యాట్రిక్ సినిమాగా ఈ సినిమా వస్తోంది. అలాగే తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్‌ రాయప్పన్‌ అని రానున్న ఓ సినిమాలోనూ ఈ కూల్ గర్ల్ ఆడిపాడనుంది.