Adi Reddy
Adi Reddy: ఆది రెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ బాగా ఫేమస్ అయ్యాడు. అలా బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్నాడు. కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి టాప్ 5 వరకు చేరుకున్నారు. నిజాయితీ గల వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు ని బాగా వాడుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూలు చెప్పుకుంటూ లక్షలు సంపాదిస్తున్నాడు.
అయితే బిగ్ బాస్ ద్వారా ఆది రెడ్డితో పాటు అతని కుటుంబం గురించి జనాలకు బాగా తెలిసింది. ఆది రెడ్డి భార్య, ముఖ్యంగా అతని చెల్లెలు నాగలక్ష్మి కి కళ్ళు కనిపించవు. ఫ్యామిలీ వీక్ లో భాగంగా వీకెండ్ ఎపిసోడ్ లో ఆమె స్టేజి పైకి కూడా వచ్చింది. అలా ఆమె గురించి అందరికి తెలిసింది. అయితే ప్రస్తుతం ఆది రెడ్డి బాగానే సంపాదిస్తున్నాడు. అతనితో పాటు భార్య కవిత, చెల్లెలు నాగలక్ష్మి కూడా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నారు.
లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ఆది రెడ్డి చెల్లెలు పెళ్లి చేయడం లేదు. కనీసం ఆమెకు కంటికి ఆపరేషన్ కూడా చేయించలేదు. అయితే ఆది రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా .. ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆది రెడ్డి .. తన చెల్లెలు నాగలక్ష్మి కంటి సమస్య ఉన్న మాట వాస్తవమే కానీ ఆమెకు కను గుడ్లు బాగానే ఉన్నా నరాలు సరిగ్గా లేవని చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ చేయించినా కళ్ళు కనిపించవని వివరించాడు.
ఆమెకు ఒక కన్ను ఐదు శాతం మాత్రమే కనిపిస్తుందని .. కానీ పది నిమిషాలు ఒక ఇంట్లో తిరిగితే అన్ని గుర్తుపెట్టుకుని కాన్ఫిడెంట్ గా నడుస్తుందని ఆది రెడ్డి అన్నారు. కళ్ళు కనిపించక తాను ఇబ్బంది పడుతుందని .. తన భార్య కవిత అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకే పెళ్లి చేయలేదని ఆది రెడ్డి వెల్లడించాడు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
View Author's Full InfoWeb Title: Why isnt adi reddy getting married to his sister who is earning crores shocking matter revealed