Lavanya Tripathi- Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ కపుల్స్ జాబితాలో వీళ్లు కూడా చేరబోతున్నారు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకొని ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి ప్రేమ విషయం ఎక్కడా బయటకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తరువాత నిశ్చితార్థం కూడా రాత్రి 11 గంటలకు కొద్ది మంది సమక్షంలోనే నిర్వహించారు. ఇప్పుడు పెళ్లిని ఇటలీలో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో అసలు వరుణ్ తేజ్, లావణ్యల వివాహాన్ని ఇటలీలో ఎందుకు చేస్తున్నట్లు? ఆ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అనే సందేహం చాలా మందికి వస్తోంది.
వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమకు 2017లో బీజం పడింది. ఆ సమయంలో వీరు స్నేహితులుగా మారారు. ఆ తరువాత వీరిద్దరు కలిసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. మొద్టలో స్నేహంగా ఉన్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఐదేళ్ల పాటు వీరు సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. అయితే అంతరిక్షం అనే సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సమయంలో వీరు ఒకరికొకరు తమ ప్రేమ విషయాన్ని చెప్పుకున్నారు. ఇక వరున్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లి సమయంలో లావణ్య చేసిన సందడితో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే మొదట్లో వార్తలను పుకార్లే అన్నారు. ఆ తరువాత సడెన్లీగా నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు బయటపెట్టారు. ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థం రాత్రి 11 గంటలకు నిర్వహించారు. ఆ తరువాత పెళ్లి ఎప్పుడనేది వెంటనే నిర్ణయించలేదు. అయితే నవంబర్ 1న వీరి పెళ్లి డిసైడ్ కావడంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ సాగింది. పెళ్లి ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనే సందేహం చాలా మందిలో ఉండేది.
కాన అంచనాలకు భిన్నంగా వీరి పెళ్లిని ఇటలీలో డిసైడ్ చేశారు. ఇటలీలోనే ఎందుకు అని కొందు మెదళ్లకు పనిపెట్టారు. ఈ క్రమంతో తెలిసిన సమాచారం మేరకు వరుణ్ తేజ్, లావణ్యల ప్రేమ ఇటలీలో మొదలైందట. అంతేకాకుడా లావణ్య త్రిపాఠి రాజుల కుటుంబం. వీరి కుటుంబ సభ్యుల్లో రాచరిక సాంప్రదాయంలో పెళ్లిళ్లు చేసుకుంటారట. అందువల్ల బంధువులు, స్నేహితులు అంతా కలిసి 50 మందితో ఇటలీకి బయలు దేరారు. వీరిలో మెగా ఫ్యామిలీ మొత్తం ఉందని సమాచారం.