https://oktelugu.com/

Renu Desai: కుటుంబం పరువు మహిళ రెండు కాళ్ల మధ్యలో ఉంటుందా? రేణుదేశాయ్ సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈ మధ్య చాలా వార్తల్లో నిలుస్తోంది రేణూ దేశాయ్. దాదాపు 23 ఏళ్ళ తరువాత మాస్ మహరాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ.

Written By: , Updated On : October 27, 2023 / 01:58 PM IST
Renu Desai

Renu Desai

Follow us on

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తో నాయకులు ఈ టాపిక్ ను ఎత్తి చూపిస్తుంటారు. ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన మూడు పెళ్లిళ్ల గురించి కచ్చితంగా మాట్లాడుతుంటారు. అయితే ఈయన పెళ్లి చేసుకున్న ముగ్గురిలో రేణూ దేశాయ్ ఒకరు. గతంలో ఓ సినిమాలో నటించగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయారు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈ మధ్య చాలా వార్తల్లో నిలుస్తోంది రేణూ దేశాయ్. దాదాపు 23 ఏళ్ళ తరువాత మాస్ మహరాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది రేణూ.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా పలు ఇంటర్య్వూలకు హాజరైంది. అందులో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, సినిమా గురించి ఎన్నో విషయాలు వివరించింది.

నేను ఎప్పుడు విడాకుల గురించి మాట్లాడినా.. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను వేరే పార్టీలకు అమ్ముడుపోయాను అని చెప్పుకొచ్చేవారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడితే .. ఈ పార్టీకి అమ్ముడుపోయానని అంటున్నారు అని నవ్వింది రేణూ.పవన్ రాజకీయ నాయకులు కావాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంలో ఎవరైనా ఆయన గురించి మాట్లాడండి. మేనిఫెస్టో బాగోలేదని, ఆయన మాట్లాడే మాటలు బాగోలేవని.. స్పీచ్ లు బాగోలేవని తిట్టండి. కానీ నా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రేణూ.

అంతే కాదు ఈమె గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు కూడా చేశారు. వీటి గురించి స్పందిస్తూ.. కుటుంబం పరువు మహిళ రెండు కాళ్ల మధ్య ఉంటుందనడం దురదృష్టం.నటనా, డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయకుండా.. ఎంతమందితో పడుకుంది? ఎవరితో పడుకుంది? ఇలా చేసిందా? అలా చేసిందా? అని క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది రేణూ దేశాయ్.