RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది..?

RRR Movie: టాలీవుడ్ సినిమాల తీరు మారుతోంది. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్లోకి వచ్చిన చాలా రోజుల తరువాత ప్రేక్షకులకు తెలిసేది. కానీ ఇప్పుడు సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ మీడియా వచ్చిన తరువాత సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ అరచేతిలో ఉంటోంది. అయితే డిజిటల్ మీడియా అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందా.? అలాంటప్పుడు కొన్ని సినిమాలు మాత్రమే ఇలా హైప్ ఎందుకు క్రీయేట్ చేస్తున్నాయి..? సినిమా సంగతి […]

Written By: NARESH, Updated On : March 25, 2022 4:16 pm
Follow us on

RRR Movie: టాలీవుడ్ సినిమాల తీరు మారుతోంది. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్లోకి వచ్చిన చాలా రోజుల తరువాత ప్రేక్షకులకు తెలిసేది. కానీ ఇప్పుడు సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నాయి. ముఖ్యంగా డిజిటల్ మీడియా వచ్చిన తరువాత సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ అరచేతిలో ఉంటోంది. అయితే డిజిటల్ మీడియా అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందా.? అలాంటప్పుడు కొన్ని సినిమాలు మాత్రమే ఇలా హైప్ ఎందుకు క్రీయేట్ చేస్తున్నాయి..? సినిమా సంగతి ఎలా ఉన్నా అది రిలీజ్ కాకముందే ఇండస్ట్రీలో వేడిని పుట్టిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటి..?

RRR Movie

కోట్ల రూపాయలు పెట్టి సినిమాను తీయడం ఎంత కష్టమో.. ఆ సినిమాను జనాల వద్దకు తీసుకెళ్లడమూ అంతే కష్టం. ఒక సినిమాను ఒక్కసారైనా చూడండి.. అని సగటు ప్రేక్షకుడికి చెప్పి.. ఆ ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ఇలా చేయడాన్ని ప్రమోషన్ వర్క్ అంటారు. ఇటీవల కాలంలో సినిమాను ప్రమోషన్ చేయడంతో చిత్రం యూనిట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా టీవీషోల్లో సదరు చిత్రానికి సంబంధించిన నటులు, టెక్నిషియన్స్ కనిపించి సినిమా నేపథ్యాన్ని వివరిస్తున్నారు.

Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?

ఒకప్పుడు సినిమాను ప్రమోషన్ చేసేందుకు ఆడియో ఫంక్షన్లను ఉపయోగించుకునేవారు. ఈ ఫంక్షన్లో పాటలన్నీ ఒకేసారి రిలీజ్ చేసేవారు. ఆ తరువాత సోషల్ మీడియా ట్రెండ్ వచ్చిన తరువాత ఇప్పుడు ఒక్కో పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా పాటలే కాకుండా ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా సినిమా వచ్చే సరికి ఏదో ఒక కార్యక్రమం ద్వారా సినీ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగి ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు.

అయితే అన్ని సినిమాల విషయంలో ఇలా జరుగుతుందా..? అంటే లేదనే చెప్పారు. చిన్న బడ్జెట్ సినిమాలు తమ సినిమా గురించి టీవీల్లో వచ్చే స్పెషల్ షో ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఫ్యాన్స్ ను థియేటర్ కు రప్పించొచ్చు..కానీ సాధారణ ప్రేక్షకుడు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. అయితే సినిమాలో కంటెంట్ బాగా ఉంటే మాత్రం అటోమెటిక్ గా సినిమాకు ప్రచారం సాగుతుంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో సందడి చేయకపోయినా డిజిటల్ మీడియాలో ట్రెండ్ ను సాధిస్తున్నాయి.

RRR Movie

ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే దర్శకుడు రాజమౌళి, చరణ్, ఎన్టీ రామారావులు ప్రత్యేకంగా ఫ్లైట్ కేటాయించుకొని సినిమా ప్రమోషన్ చేశారు. దేశవ్యాప్తంగానే కాకుండా దుబాయ్ లాంటి దేశానికి వెళ్లి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. దీంతో సినిమాపై మరింత హీట్ పెరిగింది. ఇలా సినిమాపై మోజు పెంచిన చిత్రబృందం భారీగా రేట్లను కూడా పెట్టింది. దీంతో సినిమాపై ఉన్న ఆసక్తితో ప్రేక్షకులు టిక్కెట్ల రేట్ల గురించి ఆలోచించలేదు. సినిమా కు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువే లాభాలు రావడం ఖాయమని సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగతోంది. సాధారణంగా కొన్ని సినిమాలకు హీరో, హీరోయిన్లతో ప్రమోషన్ చేయిస్తారు. కానీ రాజమౌళి మాత్రం భిన్నంగా తనతో పాటు ఇద్దరు స్టార్ హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరిగారు. దీంతో దేశవ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:RRR Movie: చంద్రబాబు ఇలాకాలో ఆర్ఆర్ఆర్ లొల్లి.. ఘర్షణ

 

Recommended Video:

Tags