https://oktelugu.com/

RRR Craze: ఓవర్సీస్, దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్

RRR Craze: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఓవర్సీస్ లో కూడా ఆర్ఆర్ఆర్ దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలు, ఫస్ట్ షో టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాగా.. రేపటి, ఎల్లుండి టికెట్ల కోసం కూడా ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. దేశంలో, విదేశాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ వచ్చేసింది. పాన్ ఇండియాగా తీసిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ ఎదురుశారు. ఎట్టకేలకు విడుదలై సంచలన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2022 / 12:19 PM IST
    Follow us on

    RRR Craze: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా.. ఓవర్సీస్ లో కూడా ఆర్ఆర్ఆర్ దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షోలు, ఫస్ట్ షో టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాగా.. రేపటి, ఎల్లుండి టికెట్ల కోసం కూడా ఎగబడుతున్న పరిస్థితి నెలకొంది. దేశంలో, విదేశాల్లో కూడా ఈ సినిమాకు క్రేజ్ వచ్చేసింది.

    RRR Craze

    పాన్ ఇండియాగా తీసిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ ఎదురుశారు. ఎట్టకేలకు విడుదలై సంచలన మౌత్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి భాషలోని ప్రేక్షకుడి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

    ఇక ఈ చిత్రం మన దేశంలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా వండర్స్ క్రియేట్ చేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్ట్ సహా అన్ని దేశాల్లో విపరీతమైన స్పందన వచ్చేసింది. ఈ సినిమా కేవలం ప్రీమియర్స్ తోనే ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టిందంటున్నారు. ఓవర్సీస్ లో అయితే అక్కడి ప్రవాస భారతీయులు ఎగబడి చూస్తున్నారు.

    Also Read: RRR Fans Dies In Accident: ముగ్గురి ప్రాణం తీసిన త్రిపుల్ ఆర్ బెన్ ఫిట్ షో.. రోడ్డు ప్ర‌మాదంలో దారుణం

    ఇక ఏపీ, తెలంగాణలో అయితే థియేటర్లపై పడిపోయారు. వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు మరింత హైప్ వచ్చేసింది. అన్ని భాషల్లోనూ సినీ విమర్శకులు, ప్రముఖులు చూసి ఏకగీవ్రంగా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు ఇచ్చేశారు.

    దీన్ని బట్టి బాహుబలి తర్వాత రాజమౌళి ఖాతాలో మరో సంచలన హిట్ పడినట్టే తెలుస్తోంది. ఈ సినిమా ఈ వారంలో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ ఆర్ఆర్ఆర్ ప్రకంపనలు ఎక్కడ వరకూ వెళుతాయో వేచిచూడాలి.

    Also Read: Celebrities Heap Praise On RRR: ఆర్ఆర్ఆర్‌పై సినీ హీరోల ప్ర‌శంస‌లు.. ఎవ‌రెవ‌రు ఏం చెప్పారంటే..

     

    Recommended Video: