https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ విషయం లో శంకర్ ఎందుకు భయపడుతున్నాడు..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్ళు ఎలాంటి సినిమాలు చేసినా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 20, 2024 / 11:17 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని అందించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఈ సినిమాలు భారీగా హెల్ప్ అయితే అయ్యాయి. ఇక మొత్తానికైతే తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరొక సక్సెస్ సాధించడానికి ముందుకు రాబోతున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాబోయే సినిమాగా ఈ సినిమాకి మంచి గుర్తింపైతే ఉంది. మరి ఈ సినిమాతో తను ఎలాగైనా సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తానికైతే రాజమౌళి లాంటి దర్శకుడితో భారీ సక్సెస్ ని అందుకున్న తర్వాత రామ్ చరణ్ శంకర్ లాంటి దర్శకుడి తో సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం…ప్రస్తుతం శంకర్ ఫామ్ లో అయితే లేడు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుందనే విధంగా కొంతమంది పేరు ప్రఖ్యాతలను సైతం ఈ సినిమా మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో శంకర్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…

    అయితే ఈ సినిమా తేడా కొడితే ఎలా అనే విషయం మీద శంకర్ కొంచెం ఈ సినిమా విషయంలో కంగారు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దిల్ రాజ్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం పక్కా అంటూ తనదైన రీతిలో సమాధానం చెబుతున్నాడు.

    ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శంకర్ మాత్రం ఈ సినిమా విషయంలో కొంచెం కంగారు పడుతున్నాడట. మరి మొత్తానికైతే ఈ సినిమాని జనవరి 10వ తేదీన ప్రేక్షకుడి ముందుకు తీసుకువస్తున్నారు. కాబట్టి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

    ఇక ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో శంకర్ భారతీయుడు 2 సినిమాతో బొక్క బోర్ల పడ్డాడు. మరి ఈ సినిమాతో నిరూపించుకుంటేనే ఆయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి.