Sai Pallavi: హీరోయిన్ లైఫ్ మహా అయితే, ఏడు ఎనిమిదేళ్లు ఉంటుంది. అంత చిన్న లైఫ్ లో కూడా చాలా లోటుపాట్లు ఉంటాయి. అందం, అభినయం ఉన్నా ఎందరికో సినిమా ఇండస్ట్రీలో కన్నీళ్లు, ఆశలు మాత్రమే మిగులుతాయి. అదే కొందరికీ అందం లేకపోయినా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వరుస హిట్లు లేకపోయినా వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తుంటాయి. ఇలాంటి హీరోయిన్ల లిస్ట్ లో ప్రస్తుతం ముందు వరుసలో ఉండే పేరు ‘సాయి పల్లవి’. నిజంగానే ఆలోచిస్తే.. సాయిపల్లవి ఎందుకు అంత సక్సెస్ అయింది ?
కచ్చితంగా నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఎవరూ ఊరికే విజయవంతం కారు. మరి ఎలా విజయవంతం అవుతారు ? అంటే.. ఎప్పుడైనా ఎవరైనా విజయం సాధించారు అంటే.. వారి వెనకాల కష్టం, ఆత్మవిశ్వాసం ఉన్నాయని అర్ధం. ఇక సాయి పల్లవి సక్సెస్ వెనుక చాలా కోణాలు దాగి ఉన్నాయి. ముందుగా సాయిపల్లవికి సంబంధం లేనివి చూద్దాం.
ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో రాణిస్తోన్న ఉత్తరాది కధానాయికల నటన చాలా కృత్రిమంగా ఉంటుంది. వాళ్ళు ఏదో తెగ కష్టపడి చూపిస్తున్నారు. మనం కూడా వాళ్ళు చూపించారు కాబట్టి, చూశాము అన్నట్టే ఉంటుంది వ్యవహారం. ఎక్కడా ఆమె మన నటీమణి అనే భావన మనలో కలగదు. ఎలాగూ అలా కలగచేసే ఆహార్యం, సహజ నటన వాళ్లల్లో ఉండదు.
ఇక వాళ్ళంతా ఎంత కష్టపడి చూపించినా అదే తెల్ల తోళ్ళు, అటు ఇటుగా అదే ఫిజిక్. కానీ, సాయి పల్లవి విషయానికి వస్తే.. అంతా పూర్తి భిన్నంగా ఉంటుంది వ్యవహారం. ఆహార్యం, సహజ నటన సాయి పల్లవి సొంతం. పాత్ర ఏదైన సాయిపల్లవి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. పాత్రకి తగ్గట్టుగా, సహజంగా, ఇష్టంగా నటిస్తుంది.
Also Read: KGF 2: అధీరా పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన సంజయ్ దత్
అందుకే, సాయి పల్లవి నటన అందరికీ నచ్చుతుంది. ఇక గ్లామర్ విషయానికి వచ్చినా.. అందాల ఆరబోతలో ముదిరిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అందుకే, ఆ కోణంలో సాయిపల్లవిని చూసే అవసరం ప్రేక్షకులకు కలగలేదు. వాళ్లకు కావాల్సింది సహజ నటన. ఆ విషయంలో సాయి పల్లవి అందర్నీ ఆకట్టుకుంది. అందుకే, ఆమెకు తిరుగులేకుండా పోయింది.
పైగా సాయిపల్లవి సహజ నటన ఒక్కటే కాదు. అద్భుతమైన నృత్యాలను కూడా చూడచక్కగా సులభంగా చేసేస్తుంది. అందుకే సాయిపల్లవికి వరుస సక్సెస్ లేకపోయినా, అందాల ప్రదర్శన చేయకపోయినా ఆమె విజయవంతం అయింది.
Also Read: Balayya: బాలయ్యకు ఎందుకు అంత క్రేజ్ అంటే.. ?