సినిమా రంగం కష్టానికి కారణం.. ఈ సినిమా పిచ్చోళ్లే !

Film Industry: ‘అఖండ’ సినిమాతో తెలిసింది ఏమిటంటే.. తెలుగు వాళ్లకు సినిమా అంటే మహా పిచ్చి అని. నిజానికి ‘అఖండ’ రిలీజ్ రోజు థియేటర్స్ అన్నీ రద్దీగా మారిపోయాయి. కరోనా భయంలోనూ సినిమా కోసం జనం బారులు తీరారు. అసలు తెలుగు వారిలో సినిమా పిచ్చి ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాస్తవానికి సినిమా అనేది జీవితంలో కేవలం ఓ వినోదం మాత్రమే. కానీ, తెలుగు వాళ్లకు మాత్రం సినిమా తమ జీవన విధానం అయిపోయింది. […]

Written By: Shiva, Updated On : December 7, 2021 6:57 pm
Follow us on

Film Industry: ‘అఖండ’ సినిమాతో తెలిసింది ఏమిటంటే.. తెలుగు వాళ్లకు సినిమా అంటే మహా పిచ్చి అని. నిజానికి ‘అఖండ’ రిలీజ్ రోజు థియేటర్స్ అన్నీ రద్దీగా మారిపోయాయి. కరోనా భయంలోనూ సినిమా కోసం జనం బారులు తీరారు. అసలు తెలుగు వారిలో సినిమా పిచ్చి ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలే ఉన్నాయి. వాస్తవానికి సినిమా అనేది జీవితంలో కేవలం ఓ వినోదం మాత్రమే. కానీ, తెలుగు వాళ్లకు మాత్రం సినిమా తమ జీవన విధానం అయిపోయింది.

Film industry

దాదాపు 80 ఏళ్ళుగా తెలుగు వారికి సినిమాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. సినిమా ఓ వినోద ప్రక్రియ అనే సంగతి మర్చిపోయారు. సినిమా అనేది తమ జీవితంలో ఓ భాగం అనుకోవడం మొదలుపెట్టారు. ఇక సినిమా అనేది ఓ సందేశాత్మక కళ అని కూడా మనవాళ్ళు నమ్మరు. సినిమా అంటే పిచ్చి అనే స్థాయికి తెలుగు ప్రేక్షకులు వెళ్లిపోయారు.

అందుకే దేశంలో మరెక్కడా లేని క్రేజ్ తెలుగు హీరోలకు, తెలుగు సినిమాలకు ఉంది. అందుకే, పక్క బాషా హీరోలు అంటుంటారు, తెలుగు వారికి సినిమా పిచ్చి ఎక్కువ అని. దానికి తగ్గట్టుగానే ఏదైనా పెద్ద సినిమా, ముఖ్యంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అయితే, మొట్టమొదటి ఆట చూడటానికి జనంతో కలబడి, రక్తాలు వచ్చేలా దెబ్బలు తగిలినా, మొత్తానికి చూసి, విజయ దరహాసంతో బయటకు రావడం ఆనవాయితీ అయిపోయింది.

Also Read: KGF 2: అధీరా పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసిన సంజయ్ దత్

ఈ స్టార్ హీరో సినిమా విడుదల సమయంలో.. ఆ హీరో అభిమానులకు ఒకటే సంబరం, వాళ్ళ హడావుడి చూసి, ఏమిటి ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. పైగా తినడానికి తిండి లేని వాడు కూడా సినిమా టికెట్ కోసం ఎంత ఖర్చు అయినా పెట్టడానికి వెనుకాడరు. అంత పిచ్చి అభిమానులు ఉన్నారు.

అందుకే, టికెట్ రేటు విషయంలో ఆ అభిమానుల లెక్కచేయని తనం చూసే.. జగన్ ఏపీలో టికెట్ రేటును తగ్గించాడు. ఒక విధంగా సినిమా రంగం నేడు ఏపీలో ఎదుర్కొంటున్న కష్టకాలానికి సగం కారణం.. ఈ సినిమా పిచ్చోళ్లే.

Also Read: Balayya: బాలయ్యకు ఎందుకు అంత క్రేజ్ అంటే.. ?

Tags