Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో ఆయన చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి సక్సెస్ ని సాధించి పెడుతుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందటమే కాకుండా తనకంటూ నటనలో ఒక వైవిధ్యభరితమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అందువల్లే రామ్ చరణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటీ అయితే కలుగుతుంది. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఒక డిఫరెంట్ అనుభూతిని కలిగించే విధంగా ఉండటం వల్లే ఆయనకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సక్సెసు లుగా నిలిచాయి… ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లలో రానా, శర్వానంద్ లు మొదటి స్థానంలో ఉంటారు. ఇక రానా విషయం పక్కనపెడితే శర్వానంద్ ఇప్పటికి కూడా ఒక్క సక్సెస్ ని సాధించాలంటే చాలా వరకు కష్టపడుతున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు.
ఒక సినిమా సక్సెస్ పడితే మరొక సినిమాతో ఫ్లాప్ ని మూట గట్టుకుంటున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల వ్యవధిలో కూడా తను ఒక మీడియం రేంజ్ హీరోగా ఎదగడానికే ఇన్ని తంటాలు ఎందుకు పడుతున్నాడు. ఆయన లాంటి నటుడు ఎందుకు ఒక భారీ స్కేల్ ఉన్న సినిమాని చేయలేకపోతున్నాడు.
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సపోర్టు ఉండి కూడా తను ఎందుకు స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. రామ్ చరణ్ అనుకుంటే శర్వానంద్ కి ఒక మంచి సినిమాని ఇప్పించగలరు. కానీ శర్వానంద్ ఎవరి సపోర్టు లేకుండా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తన దగ్గరికి వచ్చిన కథను మాత్రమే తను తీసుకొని సినిమాలుగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
అలా కాకుండా రామ్ చరణ్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఆయన స్టార్ హీరోగా మారతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రామ్ చరణ్ కూడా శర్వానంద్ కి ఏదైనా హెల్ప్ చేయడానికి తను ఎప్పుడు ముందు వరుసలోనే ఉన్నాడు. తనని వాడుకోవడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని అందువల్లే శర్వానంద్ స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి…