https://oktelugu.com/

Game Changer Teaser :  ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..కాకరేపుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ పోస్టర్!

గేమ్ చేంజర్ టీజర్ నేడు విడుదల అయ్యి ఉండేది. కానీ రీ రికార్డింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో మేకర్స్ వాయిదా వేశారు. నవంబర్ నాల్గవ తేదీన విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ నేడు కాసేపటి క్రితమే నవంబర్ 9 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలుపుతూ ఒక పోస్టర్ ని అప్లోడ్ చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 31, 2024 / 05:21 PM IST

    Game Changer Teaser

    Follow us on

    Game Changer Teaser :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సందర్భంగా, రామ్ చరణ్ అభిమానులు మూవీ టీం సరిగా ప్రొమోషన్స్ చేయడం లేదని గత కొంతకాలంగా చాలా ఫైర్ మీద ఉన్నారు. ట్విట్టర్ లో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేస్తూ అడ్డమైన బూతులు తిట్టడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. అన్ని అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం వెళ్లుంటే, నేడు టీజర్ విడుదల అయ్యి ఉండేది. కానీ రీ రికార్డింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో మేకర్స్ వాయిదా వేశారు. నవంబర్ నాల్గవ తేదీన విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ నేడు కాసేపటి క్రితమే నవంబర్ 9 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలుపుతూ ఒక పోస్టర్ ని అప్లోడ్ చేసారు.

    ఈ పోస్టర్ చూడగానే రామ్ చరణ్ అభిమానుల రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నల్లని బనీయన్ వేసుకొని రైలు పట్టాల మీద విలన్స్ ని పడుకోబెట్టి, మాస్ స్వాగ్ తో రామ్ చరణ్ కూర్చోవడాన్ని చూసి, అసలు మా హీరోతో ఏమి ప్లాన్ చేసారురా అంటూ అభిమానులు ఎంతో ఉత్సాహంతో సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించి మూడు గెటప్స్ తో కూడిన పోస్టర్స్ ని విడుదల చేసారు. పొడవాటి జుట్టుతో, స్టైలిష్ గా కనిపించిన లుక్ ఒకటి, పూర్తి స్థాయి ఫార్మల్ డ్రెస్ లో మరో లుక్ ఇప్పటి వరకు బయటకి వచ్చింది. ఇవి రెండు కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా ఉండే గెటప్ కూడా ఉంది. ఈ సన్నివేశాలు షూటింగ్ చేస్తున్నప్పుడు, గెటప్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది కానీ,మూవీ టీం ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం విడుదల చేయలేదు. ఈ మూడు క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ జీవించేసాడని, ముఖ్యంగా IAS క్యారక్టర్ చాలా యాటిట్యూడ్ తో ఉంటుందని, హీరోయిజం వేరే లెవెల్ లో పండిందని, రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఈ క్యారక్టర్ ఉండబోతుందని అంటున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాలోని పాటలు కూడా చాలా రిచ్ గా ప్లాన్ చేసాడట డైరెక్టర్ శంకర్.

    ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి, వాటికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటలే వినిపిస్తున్నాయి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి బాగా చేరువ అయ్యాయి ఈ రెండు పాటలు. త్వరలో విడుదల చేయబోయే మూడవ పాట సోషల్ మీడియా ని షేక్ చేస్తుందని అంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో అవుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ తన తదుపరి చిత్రం బుచ్చి బాబు తో చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.