Rajamouli angry with Rama: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పెను మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించిన మన దర్శకులు ఇప్పుడ వాళ్ల పంథా ను మార్చుకున్నారు. పురాణాలకు లింక్ చేస్తూ కథలను రాసుకుంటున్నారు. దాని ద్వారా భారీ సక్సెస్ లను సాధించి వందల కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు. ఇక ఇలాంటి కథలతో వచ్చిన హనుమాన్, మిరాయి లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమాలో కూడా పురాణాలను కలుపుతూ కథని రెడీ చేసుకున్నాడు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమా కూడా పురాణ కథలను బేస్ చేసుకొనే ఉంది…ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ ని రాజమౌళి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఈ ఈవెంట్లో రాజమౌళి వాళ్ల నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ రాజమౌళి ఇంత పెద్ద గొప్ప సినిమా చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఆయన వెనకాల హనుమంతుడు ఉన్నాడు. ఆయనే రాజమౌళిని నడిపిస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్లు చేశాడు… కానీ అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా రాజమౌళి స్టేజ్ మీదికి ఎక్కి కొంచెం ఎమోషనల్ అవుతూ ‘మా నాన్న నా వెనకాల హనుమంతుడు ఉన్నాడు అని గొప్పగా చెప్పాడు. కానీ నేను హనుమంతుడిని నమ్మను అంటూ ఆయన చేసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఆయన నాస్తికుడు అని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే 2011 వ సంవత్సరంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
రాజమౌళి అభిమాని ఒకరు ఆయన్ని ట్యాగ్ చేస్తూ శ్రీ రామనవమి శుభాకాంక్షలు అని విషెష్ తెలియజేస్తే దానికి రాజమౌళి రిప్లై ఇస్తూ నాకు శ్రీరాముడు అంటే ఇష్టం ఉండదని కృష్ణుడు అంటే ఇష్టమని తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుండటం తో చాలామంది రాజమౌళిని ఉద్దేశించి నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
రాముడు అంటే ఇష్టం లేనప్పుడు రాముడిని వాడుకుంటూ సినిమాలు చేయడం ఎందుకు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి భారతదేశం లో రాముడిని చాలా గొప్పగా దేవుడిగా కొలుస్తుంటారు. కారణం ఏంటి అంటే ఆయన కేవలం తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. సీత ఒక్కరిని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేదు.
కాబట్టి రాముడిలో ఉన్న మంచి లక్షణాలు సాటి మనిషిలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను నమ్మను అని రాజమౌళి చెప్పడం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి రీసెంట్ గా చేసిన ఈవెంట్ లో కూడా నేను హనుమంతుడిని నమ్మను అని చెప్పడం పట్ల చాలామంది నెటిజన్లు సైతం ఫైర్ అవుతుండటం విశేషం…
Rajamouli old tweet are pic.twitter.com/MtPYihSyem
— Tahir Ansari (@Tahir_ansari58) November 16, 2025