Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Sudheer Babu: మహేష్ బాబు ఎందుకు సుధీర్ బాబు ను పట్టించుకోవడం లేదు...

Mahesh Babu Sudheer Babu: మహేష్ బాబు ఎందుకు సుధీర్ బాబు ను పట్టించుకోవడం లేదు…

Mahesh Babu Sudheer Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతుంటాయి. అందువల్లే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ అయితే దక్కుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు చేతిలో మహేష్ బాబు పడడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

కానీ ఆయన డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతోనే స్టార్ డమ్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ భారీ విజయాన్ని సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు భారీగా సక్సెస్ లు మాత్రం రావడం లేదు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా మాత్రం అంత పెద్ద వసూళ్లనైతే రాబట్టడం లేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇంట్లో ఉన్నప్పటికి సుధీర్ బాబు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూ వస్తున్న సుధీర్ బాబుకి మహేష్ బాబు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. కనీసం ఆయన సినిమా బాగుంటే ఒక చిన్న ట్వీట్ చేసి అతన్ని ప్రమోట్ చేయొచ్చు కదా!

లేదంటే సక్సెస్ ఈవెంట్ కి హాజరై ఆ సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తే మంచి సక్సెస్ దక్కుతుంది. తద్వారా సుధీర్ బాబు కూడా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి. కదా అని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper