Anirudh Ravichander: అనిరుధ్ తెలుగు సినిమాలను ఎందుకు అంత చీప్ గా చూస్తున్నాడు…

Anirudh Ravichander: అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న కీలకమైన సీన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా చేసే పనిలో బిజీగా కొనసాగుతున్నారట.

Written By: Gopi, Updated On : June 24, 2024 10:46 am

Why is Anirudh watching Telugu movies so cheaply

Follow us on

Anirudh Ravichander: మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ప్రస్తుతం దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపటం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి చేశారు.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న కీలకమైన సీన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా చేసే పనిలో బిజీగా కొనసాగుతున్నారట. ఇక ఈ క్రమంలోనే అనిరుధ్ కూడా ఇప్పటివరకు షూటింగ్ పూర్తి అయిపోయిన దానికి రీ రికార్డింగ్ కూడా చేశారట. అయితే బ్యా గ్రౌండ్ స్కోర్ అనేది కోరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ ఊహించిన రేంజ్ లో అనిరుధ్ ఇవ్వలేకపోతున్నారట.

Also Read: Nagarjuna: తన అభిమానికి క్షమాపణలు చెప్పిన నాగార్జున.. కారణం ఏంటంటే..?

దానివల్ల మరోసారి బ్యా గ్రౌండ్ స్కోర్ మీద స్పెషల్ కేర్ తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈయన మ్యూజిక్ తమిళ్ సినిమాలకు ఇచ్చినట్టుగా తెలుగు సినిమాలకు ఇవ్వలేకపోతున్నాడు. తెలుగు సినిమాలను ఆయన అంత లైట్ గా ఎందుకు తీసుకుంటున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Kalki Movie: ప్రభాస్ కల్కికి బాలీవుడ్ లో నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తుంది ఎవరు..?

తమిళం లో చూసుకుంటే విక్రమ్, జైలర్, లియో లాంటి సినిమాలతో ఒక ఊపు ఊపేసిన అనిరుధ్ తెలుగు సినిమాకి వచ్చేసరికి మాత్రం ఢీలా పడుతున్నాడు. మరి దేవర సినిమాతో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే ఆయనకు తెలుగులో మరిన్ని ఆఫర్లు అయితే వస్తాయి. ఒకవేళ ఇది కూడా ప్లాప్ అయినట్లైతే ఆయన్ని తెలుగులో మరే దర్శకుడు పట్టించుకునే పరిస్థితిలో అయితే ఉండదు అనేది వాస్తవం… చూడాలి మరి అనిరుధ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎన్టీయార్ కొరటాల శివ భారీ రేంజ్ లో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు…