Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sundeep Reddy Vanga)… ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనువైపు తిప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఆయన చేసినవి మూడు సినిమాలే అయినప్పటికి ఆ మూడు కూడా అతన్ని చాలా టాప్ లెవల్లో కూర్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాను యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బెస్ట్ సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కెరియర్ గ్రాఫ్ ని అమాంతం పెంచే విధంగా కనిపిస్తోంది. అలాగే సందీప్ రెడ్డివంగా తనను తాను నెక్స్ట్ లెవల్లో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అనిమల్ సినిమాతో రన్బీర్ కపూర్ కి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న సినిమా కోసం పెను ప్రభంజనాలను సృష్టించే విధంగా కథను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట…స్పిరిట్ సినిమాలో కూడా కొన్ని బోల్డ్ డైలాగులు, బోల్డ్ సీన్స్ ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి సందీప్ రెడ్డివంగా ఎందుకని ఇలా బోల్డ్ కంటెంట్ నే నమ్ముకొని ముందుకు సాగుతున్నాడు. బోల్డ్ సీన్స్ లేకుండా ఆయన సినిమా చేయలేడా? అనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అలాంటి సినిమాలను రియలేస్టిక్ గా చెప్పి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకోవడమే తన స్టైల్ అని మరి కొంతమంది అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ కి ఎలాంటి సినిమానైనా సరే హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి ఉన్నప్పటికి ఆయన మాత్రం బోల్డ్ కంటెంట్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ప్రేక్షకులు ఎలాంటి ఐడియాలజీతో ఉంటున్నారు. సినిమాల్లో హీరోలను ఎలా చూపిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు రిపీటెడ్ గా చూడడానికి ప్రయత్నం చేస్తారు అనే ధోరణి లోనే ఆయన ఆలోచించి ఆ ప్రేక్షకులను టార్గెట్ చేసి మరి సినిమా చేస్తున్నాడు.
తద్వారా మళ్ళీ రిపీటెడ్ గా సినిమాలను చూసి సినిమాని సక్సెస్ తీరాలకు చేరుస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా అనిమల్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరన్నర గడుస్తున్నప్పటికి ఇప్పటివరకైతే ఆయన స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. ఇక సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్తున్న ఈ సినిమా వీలైనంత తొందరగా షూటింగ్ ను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఈ సినిమాతో ప్రపంచంలో ఉన్న పలు రికార్డులు సైతం బ్రేక్ అవ్వబోతున్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాని ఎలా తీర్చిదిద్దుతాడు. తద్వారా సందీప్ రెడ్డి వంగ తన ఐడెంటిటిని ఎలా కాపాడుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…