Ghaati Trailer Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్న కథలతో సినిమాలను చేయగలిగిన దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని తీసుకొచ్చాయి. మరి ఇలాంటి సందర్బంలోనే ప్రస్తుతం ఆయన అనుష్క తో ‘ఘాటీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు…ఈ ట్రైలర్ ని కనక మనం గమనించినట్లయితే ఒక ఏరియాలో గంజాయిని సప్లై చేస్తూ బతుకుతున్న వాళ్ళను ఇబ్బంది పెడుతూ కొంతమంది రౌడీలు వాళ్ళు ఉన్న ప్లేస్ ను ఆక్రమించుకోవాలని చూస్తారు. అయితే అనుష్క వాళ్లనుంచి తన వాళ్ళను ఎలా కాపాడుకుంది. అలాగే గంజాయి ని ఎలా అంతమొందించింది అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క చాలా రెబెల్ గా కనిపించింది. ట్రైలర్ మొత్తాన్ని చాలా ఇంటెన్స్ తో కట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో విజువల్స్ భారీ రేంజ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇక అనుష్క కొంతవరకు లావైనట్టుగా అనిపించినప్పటికి తన క్యారెక్టరైజేషన్ లో ఉన్న ఎలివేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్లో ఒక గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి…
Also Read: తెలుగు యాంకర్లు సైలెన్స్.. ఏమైంది? ఎందుకీ మౌనం..?
అనుష్క కత్తి పట్టి వెళ్తుంటే సినిమా కలెక్షన్స్ తిరగరాయబోతుందనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్లో హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ గా చేసి చూపించారు. అనుష్కకి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉందా ఆ మార్కెట్ ను వాడుకోవడానికి ఈ సినిమాను చేసినట్టుగా తెలుస్తోంది…
మ్యూజిక్ కూడా అద్భుతంగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అనేది వాస్తవం. అయితే ఈ సినిమా ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే మిగతా సినిమాల షాట్స్ ను కూడా ఇందులో వాడినట్టుగా తెలుస్తోంది.
తంగలాన్ సినిమాలోని కొన్ని షాట్స్ ను తీసుకొని ఈ సినిమాలో పెట్టారు. దానివల్ల సినిమా చూస్తున్నంత సేపు హై ఫీల్ అయితే కలిగింది. కానీ అవి తంగాలాన్ సినిమా నుంచి కాపీ చేసి పెట్టినట్టుగా ఈజీగా తెలుస్తోంది… తంగలను సినిమా బ్యాక్ డ్రాప్ ని ఈ సినిమా కోసం వాడుకున్నట్టుగా కూడా క్లియర్ గా తెలిసిపోతోంది. మరి ఇలాంటి కథను క్రిష్ జాగర్లమూడి ప్రేక్షకుడికి నచ్చే విధంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలరా లేదా అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారుతోంది…
