Mayasabhafull Series Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. హీరోలు సినిమాలతో పాటుగా సిరీస్ లను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులోకి రావడంతో ప్రతి ప్రేక్షకుడు పెద్ద ఎత్తున సిరీస్ లను చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా అతని అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సినిమా ఏ సిరీస్ ఎలా ఉందో తన ఒపీనియన్ ని ఇతరులతో పంచుకుంటున్నాడు… ఇక ఇదిలా ఉంటే దేవ కట్ట లాంటి స్టార్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జరిగిన కొన్ని విషయాలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఒక ఫిక్షన్ స్టోరీ రాసుకొని ‘మయసభ’ అనే సిరీస్ చేశారు… ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది. సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
కథ
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో రెడ్డిగారు నాయుడు గారి ఎంట్రీ ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని వాళ్ళు ఎలా మలుపు తిప్పారు. ఫ్రెండ్స్ గా ఉన్నవాళ్లు శత్రువులుగా మారడానికి గల కారణం ఏంటి? అనే కొన్ని విషయాలను ఇందులో తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు…మరి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిన తర్వాత సినిమాలో ఏం జరిగింది అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే దేవకట్ట దీన్ని చాలా సెన్సిటివ్ గా డీల్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఒకపక్క రెడ్డి గారు, మరోపక్క నాయుడు గారి రాజకీయ ఎంట్రీని చాలా విభిన్నంగా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇందులో చాలా వరకు ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి ఏది ఫిక్షన్ ఏది రియల్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయలేకపోయారు. ఇక నాయుడు గారి ప్రేమ వ్యవహారం కూడా ఈ సిరీస్ కి చాలా హైలెట్ గా నిలిచింది… స్టూడెంట్ లీడర్ గా మొదలైన ఆయన రాజకీయ నాయకుడి గా తన ప్రస్థానం ఎలా ముందుకు సాగింది అనే విషయాలను ఈ సిరీస్ లో చర్చించే ప్రయత్నం చేశారు.
ఇక రెడ్డి గారు డాక్టర్ చదువుతూనే పేదలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఆయన ఎలాంటి పనులను చేశాడు అనేది కూడా తెలిపే ప్రయత్నం అయితే చేశాడు. ఇక తొమ్మిది ఎపిసోడ్లలో ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో హై ఎలిమెంట్ ని తీసుకొని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. మొత్తం 6 గంటల 50 నిమిషాల వరకు నిడివి తో ఉన్న ఈ సిరీస్ ని చూడాలంటే కొంతవరకు ఓపిక ఉండాలి. ఇక ఈ సిరీస్ ను ఒక్కసారి మనం చూడటం స్టార్ట్ చేస్తే చాలు ఒక్కో ఎపిసోడ్ లో మనం ఇన్వాల్వ్ అయిపోతూ ముందుకు సాగుతూ ఉంటాం… ఇక ఇప్పటివరకు ఇలాంటి ఒక పొలిటికల్ సిరీస్ అయితే తెలుగులో ఇప్పటివరకు రాలేదు. ఈ సిరీస్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇక ఎన్టీఆర్ గారి పాత్రని పోషించిన సాయికుమార్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడు. ఆయన చెప్పిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి…ఇక సెకండ్ సీజన్ కి లీడిస్తూ ఈ సిరీస్ ని ఎండ్ చేసిన విధానం కూడా బాగుంది…అది పెద్దగా ఇబ్బంది కలిగించే అవకాశం అయితే లేకుండా చాలా నీటుగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. అలాగే కొన్ని బూతులను కూడా ఈ సిరీస్ లో వాడారు. అది కొంతవరకు ఎబ్బెట్టుగా అనిపిస్తోంది… ఇక 1960 నుంచి ఆ తర్వాత జరిగిన స్టోరీ ని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి అప్పటి ఆర్ట్ వర్క్ అయితే మెప్పించే విధంగా ఉంది…అయితే కొన్ని ఎపిసోడ్స్ బోర్ గా అనిపించాయి…అలాగే కొన్నింటిలో ఎలాంటి హై మూమెంట్ లేకుండా నడిపించారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి, చైతన్య రావు లు వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాల్లో వాళ్ళకి దక్కిన పాత్రల కంటే ఇవి చాలా గొప్ప పాత్రలనే చెప్పాలి. వాళ్ళ పర్ఫామెన్స్ ద్వారా ఒక్కసారి అప్పటి కాలానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… సాయి కుమార్ పోషించిన ఎన్టీఆర్ పాత్ర కూడా ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. ఇక ఈ క్యారెక్టర్ ను మినహాయిస్తే మిగిలిన ఏ క్యారెక్టర్ కూడా ప్రేక్షకుడిని హుక్ చేయలేకపోయింది. అన్ని క్యారెక్టర్స్ వచ్చిపోయే పాత్రలే తప్ప స్టేబుల్ గా ఉండే పాత్రలు లేవు దానివల్ల ఆ క్యారెక్టర్లకు పర్ఫామ్ చేయడానికి ఎక్కువగా స్కోప్ లేకుండా పోయింది… మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు మైనస్ అయింది… విజువల్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నప్పటికి కొన్ని కీలకమైన సన్నివేశాల్లో డిఫరెంట్ షాట్స్ ని వాడి ప్రేక్షకులకు హై ఫీల్ తెప్పించే ప్రయత్నం చేశారు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
3 వ ఎపిసోడ్ ఎండింగ్ బాగుంది…
అది పినిశెట్టి, చైతన్య రావు యాక్టింగ్ బాగుంది…
విజువల్స్ బాగున్నాయి…
మైనస్ పాయింట్స్
కొన్ని ఎపిసోడ్స్ బోర్ కొట్టించాయి…
కొన్ని అనవసరమైన సీన్స్ ను పెట్టారు…
రేటింగ్
ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.5/5
