Rajeev Kanakala: రాజీవ్ కనకాల ఎందుకు చనిపోయే పాత్రలు చేస్తారు? ఇన్ని సినిమాల్లో చనిపోయారా?

Rajeev Kanakala స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాల్లో మెప్పించారు ఈ యాక్టర్. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

Written By: Swathi, Updated On : February 14, 2024 12:20 pm
Follow us on

Rajeev Kanakala: రాజీవ్ కనకాల ఒకప్పుడు చాలా ఫేమస్ యాక్టర్. ఈయన నటించని సినిమాలు ఉండేవి కావు. చాలా సినిమాల్లో ఈయన నటిస్తూ ఉండేవారు. సైడ్ క్యారెక్టర్లు చేసినా కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నారు రాజీవ్. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రాజీవ్ కనకాల. మూడు దశాబ్దాలుగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఏకంగా ఈ నటుడు 150 చిత్రాలకు పైగా నటించారు అంటే నమ్ముతారా?

స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాల్లో మెప్పించారు ఈ యాక్టర్. ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈయన సైడ్ క్యారెక్టర్లకంటే ఎక్కువగా విలన్ పాత్రలోనే నటించారు. స్టార్ యాంకర్ సుమ ఈయన సతీమణి అనే విషయం తెలిసిందే. ఆమెకు ఈయన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెబుతారు కూడా. ఇక ఈ మధ్య ఈ దంపతుల కుమారుడు రోషన్ కూడా బబుల్ గమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక రాజీవ్ కనకాల తనకు సినిమాల్లో ఛాన్సులు కావాలని అడగను అని.. ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తాను అనిపిస్తే వారే ఛాన్స్ ఇస్తారని తెలిపారు రాజీవ్ కనకాల. అయితే ఈయన ఏ సినిమాలో చేసినా కూడా ఎక్కువగా ఈ పాత్ర చనిపోతుంటుంది. అంటే రాజీవ్ కనకాల చేసే సినిమాల్లో ఆయన చనిపోవడం కామన్ గా ఉంటుంది. ఇంతకీ ఏ ఏ సినిమాల్లో ఆయన ఇలాంటి పాత్రలు చేశారో చూద్దాం..
1..స్వామి.. ఇందులో విలన్ పాత్రలో నటించి చనిపోయారు. 2 అశోక్: ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో నటించి ఇందులో కూడా చనిపోయారు. 3.. రాజుగారి గది 2: హీరో అన్నయ్యగా నటించిన ఈ పాత్రలో కూడా చినిపోతారు. 4: ఏ ఫిల్మ్ బై అరవింద్: విలన్ షేడ్స్ లో ఉన్న పాత్రలో రాజీవ్ చనిపోతారు. 5: అతడు: కీలకమైన పార్థు పాత్రలో నటించి మరణిస్తారు రాజీవ్. 6: హరేరామ్: డాక్టర్ పాత్రలో మెప్పించి ఇందులో కూడా చనిపోతారు. 7: అతిథి: గౌతమ్ అనే పాత్రలో మెప్పించి మరణిస్తారు రాజీవ్. 8: దూకుడు సినిమాలో మహేష్ బాబు బాబాయ్ పాత్రలో నటించారు. 9: బాద్ షా: డాక్టర్ పాత్రలో మెరిశారు. 10: రాజా ది గ్రేట్: ఈ సినిమాలో కూడా రాజీవ్ మరణిస్తారు. 11: లవర్-జగ్గు పాత్ర 12: రంగస్థలం-రంగమ్మత్త భర్త 13: బింబిసార: రాజీవ్ అనే పాత్ర 14: వీర సింహారెడ్డి: బాలయ్య బాబు సూపర్ హిట్ సినిమాలో కూడా నటించిన రాజీవ్ కనకాల చనిపోతారు.

ఇలా చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల పాత్రలో చనిపోతాయి. అయితే ఏ సినిమాలో అయితే మెయిన్ క్యారెక్టర్లు చనిపోతాయో ఆ సినిమాలు హిట్ ను సొంతం చేసుకుంటాయి అనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఇలాంటి పాత్రల్లో ఎక్కువగా రాజీవ్ నటించారు.