spot_img
Homeఆంధ్రప్రదేశ్‌BJP TDP Alliance: బిజెపికి నో చెప్పలేని స్థితిలో టిడిపి

BJP TDP Alliance: బిజెపికి నో చెప్పలేని స్థితిలో టిడిపి

BJP TDP Alliance: తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సంకట దుస్థితి. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పొత్తు ఉండాలి కానీ.. మెజారిటీ సీట్లు వదులుకునే పరిస్థితిలో టిడిపి లేదు. అయితే జనసేన, బిజెపి మాత్రం సీట్ల విషయంలో పట్టుదలతో ఉన్నాయి. మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తున్నాయి. వాటిని ఇస్తేనే పొత్తు అని తేల్చి చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సీట్లు ఇస్తామని చెప్పడం లేదు. ఇవ్వమని చెప్పడం లేదు. లోలోపల సతమతమవుతున్నారు. ఒకవేళ వారు అడిగిన అన్ని సీట్లు ఇస్తే పార్టీలో తిరుగుబాటు తప్పదని భావిస్తున్నారు.

బిజెపి నేతల ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. కొన్ని ప్రతిపాదనల విషయం తెలుసుకున్నారు. కానీ అటు తరువాత ఈ చర్చల్లో పురోగతి నిలిచిపోయింది. ఎక్కడా చర్చలు జరుపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఇదే సమయంలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి హరి రామ జోగయ్య లేఖలు విడుదల చేస్తున్నారు
. పొత్తు కుదరాలంటే జనసేనకు భారీగా సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే ఈ లేఖలు.. బిజెపి చెబుతున్న లెక్కలకు దగ్గరగా ఉండడంతో అందరిలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ లేఖల వెనుక బిజెపి హస్తము ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం జనసేన, టిడిపి మధ్య విభేదాలు సృష్టించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. తద్వారా పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

బిజెపి అగ్రనేతలు మూడు అంశాలతో పొత్తుకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. బిజెపి, జనసేనకు 60 అసెంబ్లీ స్థానాలు, పది పార్లమెంట్ స్థానాలు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ వంటి షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి టిడిపి క్యాడర్ ఒప్పుకోదని చంద్రబాబుకు తెలుసు. అన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు కూడా మనసు రాదు. అదే జరిగితే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని కూడా చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఎలా ముందుకెళ్లాలో తెలియక గుంభనంగా ఉన్నారు. ఇంతవరకు వచ్చి పొత్తులు కుదరకపోతే బిజెపి నుంచి ఎదురయ్యే పరిణామాలు కూడా తెలుసు. అందుకే పొ త్తు వద్దని చెప్పలేరు. ఉండాలంటే ఎక్కువ సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version