https://oktelugu.com/

Ram Charan: రాఘవేంద్ర రావు తో మొదటి సినిమా చేయాల్సిన రామ్ చరణ్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఎందుకు చేశాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులను లక్కీ హ్యాండ్ గా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు (Raghavendra Rao) లాంటి స్టార్ డైరెక్టర్ ను ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు లక్కీ హ్యాండ్ గా పిలుచుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆయనతో ఒక సినిమా చేస్తే చాలు ఆ హీరోలకు ఎనలేని గుర్తింపు అయితే వచ్చేది.

Written By:
  • Gopi
  • , Updated On : February 9, 2025 / 06:35 PM IST
    Ram Charan

    Ram Charan

    Follow us on

    Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు రాఘవేంద్ర రావు(Raghavendra Rao) డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్వారు. ఎందుకంటే ఆయనతో చేసిన హీరోలకు సెపరేట్ మార్కెట్ కూడా క్రియేట్ అయ్యేది. ఇక ఇదిలా ఉంటే రామానాయుడు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం రాఘవేంద్ర రావు దర్శకత్వంలోనే తన కొడుకు అయిన వెంకటేష్ (Venkatesh) ని ‘కలియుగ పాండవులు’ (Kaliyuga Pandabulu) అనే సినిమాతో పరిచయం చేశాడు. వెంకటేష్ దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఈయన తర్వాత కృష్ణ కూడా తన కొడుకు అయిన మహేష్ బాబు(Mahesh Babu) ని రాజకుమారుడు (Rajakumarudu)సినిమాతో రాఘవేంద్రరావు చేతుల మీదగానే ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు. ఇక దాదాపు 25 సంవత్సరం నుంచి మహేష్ బాబు ఇండస్ట్రీకి మంచి సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక వీళ్లిద్దరి తర్వాత అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్(Allu Arjun) ను గంగోత్రి (Gangotri) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అప్పజెప్పాడు..ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగి ఇప్పటికి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు.

    లక్కీ హ్యాండ్ గా పిలవబడుతున్న రాఘవేందర్రావు చేతుల మీదిగానే మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు అయిన రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేయించాలని మొదట తీవ్రమైన ప్రయత్నమైతే చేశాడు. కానీ పూరి చేసిన పోకిరి (Pokiri) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో అలాగే అల్లు అర్జున్ తో చేసిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

    ఈ రెండు సినిమాల రిజల్ట్ ని చూసిన చిరంజీవి పూరి జగన్నాధ్ చేతుల మీదుగా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడు. అలా చేస్తే మాస్ లో కూడా మంచి ఇమేజ్ అయితే ఉంటుందనే ఉద్దేశ్యంతోనే పూరి జగన్నాధ్ తో రామ్ చరణ్ తన మొదటి సినిమాను చేశాడు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ‘ చిరుత ‘(Chirutha) సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి రామ్ చరణ్ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతాడు అనే ఒక కాన్ఫిడెంట్ ను అయితే అందరికీ ఇచ్చింది. ఇలా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ అవ్వాల్సిన రామ్ చరణ్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…