https://oktelugu.com/

Thandel: ‘తండేల్’ క్లైమాక్స్ లో సమంత ఉందా..? సోషల్ మీడియా ని ఊపేస్తున్న లేటెస్ట్ వీడియో!

ఈ చిత్రంలో ఆయన నటించాడు అని అనడం కంటే, జీవించాడు అని చెప్పొచ్చు. ఈ పాత్రలో ఆయన ఒదిగిపోవడానికి ఎంతో హోమ్ వర్క్ చేసాడు. శ్రీకాకుళం వెళ్లి అక్కడి జాలరులతో కలిసిపోయి చాలా కాలం వాళ్ళ అలవాట్లు, ఆహార్యాన్ని అర్థం చేసుకొని, యాసని కూడా ఒడిసిపట్టేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 9, 2025 / 06:31 PM IST
    Thandel (1)

    Thandel (1)

    Follow us on

    Thandel: అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగు రాష్టాల్లో మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి సూపర్ హిట్ లేక ఇబ్బందులు పడుతున్న అక్కినేని ఫ్యామిలీ కి ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ వారిలో మంచి జోష్ ని నింపింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ అయితే భూమి మీద నిలబడడం లేదు. సంబరాల మీద సంబరాలు చేసుకుంటూ మీడియా ముందు కనిపిస్తున్నాడు. ఆయన ఉత్సాహాన్ని చూస్తుంటే చిన్న పిల్లవాడిలాగా మారిపోయినట్టు అనిపిస్తుందని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆడియన్స్ విడుదలకు ముందు కచ్చితంగా సాయి పల్లవి నాగ చైతన్య ని నటనలో డామినేట్ చేసేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదని అనుకున్నారు. కానీ విడుదల తర్వాత నాగ చైతన్య నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

    ఈ చిత్రంలో ఆయన నటించాడు అని అనడం కంటే, జీవించాడు అని చెప్పొచ్చు. ఈ పాత్రలో ఆయన ఒదిగిపోవడానికి ఎంతో హోమ్ వర్క్ చేసాడు. శ్రీకాకుళం వెళ్లి అక్కడి జాలరులతో కలిసిపోయి చాలా కాలం వాళ్ళ అలవాట్లు, ఆహార్యాన్ని అర్థం చేసుకొని, యాసని కూడా ఒడిసిపట్టేసాడు. అలా ఆయన పడిన కష్టాన్ని సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో కనిపించాడు. మనకి ఈ చిత్రంలో నాగచైతన్య కనిపించడు, కేవలం ‘తండేల్’ రాజు క్యారక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ఆ రేంజ్ లో జీవించాడు ఆయన. అందుకే విడుదల తర్వాత అందరూ నాగ చైతన్య నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. ఈ 20 నిమిషాల్లో నాగ చైతన్య నటన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. ఆ రేంజ్ లో జీవించాడు.

    హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, శుభలేఖ నాగ చైతన్య చేతిలో పెట్టినప్పుడు, నాగ చైతన్య ఎంతో ఎమోషనల్ గా గురై, ఏడుస్తూ అలా నిలబడిన సన్నివేశానికి సంబాణిధించిన వీడియో ని సోషల్ మీడియా లో అభిమానులు షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు ఏమంటున్నారంటే ‘నాగ చైతన్య ఈ పాత్రలో జీవించడానికి ముఖ్య కారణం సమంత. ఆమెతో విడాకుల వ్యవహారాన్ని గుర్తు తెచ్చుకొనే అలా ఏడ్చేశాడు’ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బహుశా అది కూడా నిజం అయ్యి ఉండొచ్చు. ఇలాంటి సన్నివేశాల్లో హీరోలు ఎమోషనల్ అవ్వడానికి తమ జీవితాల్లో జరిగిన విచారకరమైన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాగ చైతన్య కూడా అలా సమంత ని గుర్తు చేసుకొని ఉండుంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాగ చైతన్య ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అనే చెప్పాలి. భవిష్యత్తులో ఆయనకు ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ కూడా రావొచ్చు.