https://oktelugu.com/

Missamma: ‘మిస్సమ్మ’ సినిమాను రీమేక్ చేయబోతున్న నందమూరి, అక్కినేని నట వారసులు ఎవరో తెలుసా..?

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. మరి వాళ్ళు చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి స్టార్ హీరోలుగా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడం మాత్రం వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి...

Written By: , Updated On : February 9, 2025 / 06:42 PM IST
Missamma

Missamma

Follow us on

Missamma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది ఎన్టీయార్(NTR), నాగేశ్వరరావు (Nageshwara rao) ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే వీళ్ళిద్దరిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మిస్సమ్మ ‘ (Misamma) మరి ఈ సినిమాని రీమేక్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు చాలా సంవత్సరాల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాని నాగచైతన్య(Naga Chaithanya), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) లతో రీమేక్ చేయాలని అనుకున్నప్పటికి అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ విషయం అయితే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బాబు (Balayya Babu) కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) అలాగే నాగార్జున (Nagarjuna) కొడుకు అయిన అఖిల్ (Akhil) తో ఈ సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాతో అక్కినేని, నందమూరి ఫ్యామిలీల మధ్య ఉన్న కొన్ని విభేదాలు కూడా తొలగిపోతాయి అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరి బాలకృష్ణ, నాగార్జున మధ్య గత కొద్ది రోజుల నుంచి మంచి మాటలు అయితే లేవు. మరి ఈ సినిమాకి వీళ్లిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంలో మోక్షజ్ఞ ఉన్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియా లెవెల్లో తను సక్సెస్ అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నట వారసులంతా రాణిస్తున్న సందర్భంలో బాలయ్య బాబు కొడుకు ఆయన మోక్షజ్ఞ ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…

మరి ఇదిలా ఉంటే ఇప్పటికే మోక్షజ్ఞతో సినిమా చేయడానికి మరొక ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక అఖిల్ విషయానికి వస్తే ఆయన ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే పడలేదు. ఇక రాబోయే సినిమాలతో అయిన సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవాలని ప్రయత్నంలో తన ఉన్నట్టుగా తెలుస్తోంది…