https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి సినిమాలో రజినీకాంత్ చేయాల్సిన క్యారెక్టర్ ను ఎందుకు రిజెక్ట్ చేశాడు…

ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటివాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇప్పటికి ఆయన వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. 70 సంవత్సరాల వయసులో కూడా ఎవరికీ తగ్గకుండా తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఇక మీదట కూడా భారీ రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 09:14 AM IST

    Chiranjeevi(23)

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి స్టార్ హీరో మరొకరు లేరనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. 45 సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఏకైక హీరో కూడా చిరంజీవి గారే కావడం విశేషం. ఇక తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా 2025 సమ్మర్ కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. మరి ఇదే నేపధ్యంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అందుకుంటున్నాయి. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ చిరంజీవి కెరియర్లో ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఆయన కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన స్నేహం కోసం సినిమా ప్రేక్షకుల్లో కొంతవరకు ఒకే అనిపించినప్పటికీ చిరంజీవి రేంజ్ సక్సెస్ అయితే సాధించలేదు.

    ఇక దానికి తోడుగా ఈ సినిమాలో విజయ్ కుమార్ పాత్ర కోసం మొదట రజనీకాంత్ ని తీసుకోవాలని డైరెక్టర్ రవికుమార్, చిరంజీవి భావించారు. కానీ రజనీకాంత్ మాత్రం ఈ క్యారెక్టర్ కి నో చెప్పాడట. ఎందుకంటే అప్పటికే ఆయన హీరోగా చేస్తున్నాడు. కాబట్టి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేయడం అది కూడా ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ లో చేయడం అనేది అతనికి నచ్చలేదట. దానివల్ల ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. రెండు క్యారెక్టర్లలో మెప్పించడమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులందరిని తన నటనతో కట్టిపడేసాడనే చెప్పాలి. మరి మొత్తానికైతే రజనీకాంత్ కనక ఈ సినిమాలో చేసి ఉంటే మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరిని మనం ఒకే స్క్రీన్ మీద చూసి ఆనందపడేవాళ్ళం… ఇక చిరంజీవితో సినిమా చేయడం తనకు ఇష్టమే అయినప్పటికీ అంత ఓల్డేజ్ క్యారెక్టర్ లో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని రజినీకాంత్ చెప్పడంతో ఆ క్యారెక్టర్ కోసం విజయ్ కుమార్ ని తీసుకున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో అలాగే సూపర్ స్టార్ లాంటి రజినీకాంత్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు ఇప్పటికి ఉత్సాహపడుతున్నారు. మరి ఇకమీదటైనా ఈ కాంబో వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…