https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు, కమల్ హాసన్ కాంబోలో రావాల్సిన ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు.. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తరువాత ఆ రేంజ్ లో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్న హీరో కూడా తనే కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 09:28 AM IST

    Mahesh Babu(8)

    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్న మహేష్ బాబు ఇప్పటికే మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో మహేష్ బాబు కీలకపాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే లోకనాయకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న కమల్ హాసన్ తను చేసిన సినిమాలన్నింటిని తెలుగులో డబ్ చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక తెలుగులో కూడా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ ఆ సినిమా అనుకోని కారణాలవల్ల తెరమీదకి రాలేదని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.

    ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా అయితే రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మెటీరియలైజ్ అయితే కాలేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వచ్చుంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయి ఉండేదని చాలామంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ తో కలిసి కమల్ హాసన్ చేసిన కల్కి సినిమా మంచి విజయాన్ని సాధించింది.

    కల్కి 2 సినిమాలో కమల్ హాసన్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ తో చేసిన కమల్ హాసన్ మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేసి ఉంటే బాగుండేదని అటు కమల్ హాసన్ అభిమానులు ఇటు మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ లాంటి ఒక గొప్ప నటుడితో నటించడం అనేది ఒక వండర్ ఫుల్ మెమోరీ అని ఆయనతో నటించిన చాలామంది నటీనటులు చెబుతూ ఉంటారు… ఇక ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 3 సినిమాతో పాటు మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న థగ్ లైఫ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. దాంతో పాటు కల్కి 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు…