Ind Vs SA T20: సంజు సూపర్ ఫామ్ లో ఉన్నాడు సరే.. టాప్ ఆర్డర్ వైఫల్యం సంగతేంటి? : నేడు సౌత్ ఆఫ్రికా తో రెండవ టి20..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 4 t20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ మెరుపు సెంచరీ చేశాడు.

Written By: Neelambaram, Updated On : November 10, 2024 8:43 am

Ind Vs SA T20

Follow us on

Ind Vs SA T20: అతడి అద్భుతమైన బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 61 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఇక ఆదివారం జరిగే రెండవ టి20 మ్యాచ్ లోనూ ఇదే జోరు కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది.. అయితే ఇక్కడ గత ఏడాది ఏకైక t20 మ్యాచ్ జరిగితే.. భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ మ్యాచ్ విషయానికొస్తే టీమిండియాలో సంజు తప్ప మిగతా ఆటగాళ్లు రాణించలేదు. అతడు మాత్రమే దక్షిణాఫ్రికా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సునాయాసంగా సిక్స్ లు కొట్టాడు. సంజు నిలబడటం వల్ల టీమిండియా భారీ స్కోర్ చేసింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అవకాశాలు వస్తున్నప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ సద్వినియోగం చేసుకోవడం లేదు. అత్యంత నిరాశజనకమైన ఆట తీరును అతను ప్రదర్శిస్తున్నాడు. జింబాబ్వేర్ మీద సెంచరీ చేసిన అతడు.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్లలో 20 పరుగుల లోపే అవుట్ అయ్యి.. పరువు తీసుకున్నాడు. ఆదివారం జరిగే మ్యాచ్ అతనికి అత్యంత ముఖ్యం కానుంది.

తిలక్ వర్మ వేగంగా ఆడుతున్నప్పటికీ.. వాటిని భారీ ఇన్నింగ్స్ ల లాగా మలచ లేకపోతున్నాడు. అతడు ఆ దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. సూర్య కుమార్ యాదవ్ పరిస్థితి కూడా ఇదే. హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్లో తేలిపోయాడు. చెప్పుకోవడానికి బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా కనిపిస్తున్నప్పటికీ టీమిండియా తొలి మ్యాచ్లో 36 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఈ ప్రకారం చూసుకుంటే జట్టు బ్యాటింగ్ బలహీనత మరోసారి బయటపడింది. అందువల్లే రెండో మ్యాచ్లో టీమిండియా బలహీనతను అధిగమించాల్సి ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ సత్తా చాటారు. 141 పరుగులకే ప్రత్యర్థి జట్టును వారి సొంతమైదానంపై నిలుపుదల చేశారు. బంగ్లాదేశ్ పై వరుణ్ చక్రవర్తి చేసిన ప్రదర్శనను.. దక్షిణాఫ్రికాపై కూడా చేశాడు. రవి బిష్ణోయ్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక ఆవేష్, అర్ష్ దీప్ సింగ్ తమలయను అందుకోవాల్సి ఉంది. వీరు ప్రారంభ ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. అది జట్టుకు ఇబ్బందికరంగా మారింది.

సఫారీ జట్టు ఒత్తిడితో ఇబ్బంది పడుతోంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టుతో ఓటమి తర్వాత.. ఆ జట్టు పూర్తి నైరాశ్యంలో మొరిగినట్టు కనిపిస్తోంది. ఐలాండ్ జట్టుతో సిరీస్ సమం చేయడం, వెస్ట్ ఇండీస్ జట్టుతో ఓడిపోవడం వంటివి ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో కీలక ఆటగాళ్లు డికాక్, రబాడ, నోకియా, షంశి వంటి వారు లేకపోవడం ఆ జట్టును తీవ్రంగా కలవడానికి గురి చేస్తోంది. తొలి మ్యాచ్లో ఏ ఆటగాడు కూడా 25 పరులకు మించి చేయలేకపోయాడు. అయితే రెండో మ్యాచ్ లో నైనా సత్తా చాటాలని దక్షిణాఫ్రికా అభిమానులు కోరుకుంటున్నా. క్లాసెన్, మిల్లర్, మార్క్రం వంటి ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయాల్సి ఉంది.. ఇక బౌలర్లు మాత్రం డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే ప్రారంభ ఓవర్లలో తేలిపోతున్నారు.

తుది జట్ల అంచనా ఇలా

సూర్య కుమార్, హార్దిక్, తిలక్, అక్షర్, రవి, రింకూ, వరుణ్, ఆవేష్.. అర్ష్ దీప్ సింగ్, సంజు సాంసన్, అభిషేక్ శర్మ.

దక్షిణాఫ్రికా

హెన్ డ్రిక్స్, రికెల్టన్, క్లాసెన్, మార్క్రం, స్టబ్స్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, బార్ట్ మన్, పీటర్, కోట్జీ.

పిచ్, వాతావరణం ఎలా ఉందంటే.

గెబెహా లోని సెయింట్ జార్జ్ మైదానం ప్రారంభంలో బ్యాటర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ మైదానంపై సగటు స్కోర్ 135 పరుగులు మాత్రమే. సాయంత్రం ఇక్కడ స్వల్ప స్థాయిలో జల్లుల కురిసే అవకాశం కనిపిస్తోంది.