Rajendra Prasad Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దిగ్గజ నటులలో ఒకరు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. మాస్, ఫ్యామిలీ, క్లాస్ హీరోలకు ధీటుగా కామెడీ హీరో గా రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేసాడు. ఆరోజుల్లో ఈయన సినిమాలు చిరంజీవి చిత్రాలతో పోటీ పడేవి అంటేనే అర్థం చేసుకోవచ్చు, అప్పట్లో హీరో గా రాజేంద్ర ప్రసాద్ రేంజ్ ఎలాంటిది అనేది. వయస్సు పెరిగిన తర్వాత ఎంత సూపర్ స్టార్ కి అయినా మార్కెట్ పోవాల్సిందే. అలా రాజేంద్ర ప్రసాద్ కి కూడా మార్కెట్ పోయింది. హీరోగా మార్కెట్ ని పోగొట్టుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ కి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వచ్చాయి. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నాడు ఆయన.
అయితే సాధారణ మనుషుల జీవితాల్లో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉంటాయో సెలెబ్రిటీలకు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ జీవితం లో కూడా అలాంటి కష్టాలు ఉంటాయి. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పేరు గాయత్రి, ఆమె అంటే ఆయనకు పంచ ప్రాణాలు. చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ప్రతీ తండ్రికి తన కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని కోరిక ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కి కూడా అలాంటి కొరికే ఉంది. కానీ గాయత్రి రాజేంద్ర ప్రసాద్ కి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది ఆయనకు గుండెలు ఆగిపోయేంత పని చేసింది. ఆమెతో మాట్లాడడం కొన్నాళ్ళు పూర్తిగా మానేసాడు.
కానీ ఎంత కాలం కన్న కూతురికి దూరంగా ఉండగలడు?, కొన్నాళ్ళకు ఆయనే తన ఇంటికి కూతురుని పిలిపించుకున్నాడు. ఆమె గడుపుతున్న జీవితాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందాడు, బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాడు. గాయత్రి కి సాయి తేజస్విని అనే కూతురు పుట్టింది. ఈమె అంటే రాజేంద్ర ప్రసాద్ కి ఎంతో ఇష్టం. మహానటి చిత్రం లో ఈ చిన్నారి చిన్నప్పటి సావిత్రి క్యారక్టర్ ని చేసింది. అలా తన కూతురుతో, మానవరాలితో కలిసి రాజేంద్ర ప్రసాద్ ఎంతో సంతోషవంతమైన జీవితం గడుపుతున్న సమయం లో ఆయన నుండి నేడు తన కూతుర్ని తీసుకెళ్లిపోయాడు దేవుడు. ఈరోజు తెల్లవారు జామున మనం ఆ చేదు వార్త తోనే రోజు ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆమె వయస్సు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే, గుండెపోటుతో మరణించింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న ఆమెను, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని AGS హాస్పిటల్ కి తరలిస్తుండగా ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఇంత చిన్న వయస్సులో ఆమెకి ఇలా జరగడం శోచనీయం అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, రాజేంద్ర ప్రసాద్ కి ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని సోషల్ మీడియా లో అభిమానులు ప్రార్థన చేస్తున్నారు.