Women’s T20 World Cup 2024  : మహిళా టి20 వరల్డ్ కప్ లో ఇంత దారుణమా.. ఈ ఫీల్డింగ్ తో క్రీడా సమాజానికి ఏం మేసేజ్ లు ఇస్తున్నారు?Women’s T20 World Cup 2024  : మహిళా టి20 వరల్డ్ కప్ లో ఇంత దారుణమా.. ఈ ఫీల్డింగ్ తో క్రీడా సమాజానికి ఏం మేసేజ్ లు ఇస్తున్నారు?

మహిళల టి20 వరల్డ్ కప్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రెండు మ్యాచ్ లలో పోటాపోటీగా జట్లు తలపడ్డాయి. ఫలితంగా విజయం అంత సులువుగా దక్కలేదు. దీంతో ఆయా జట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. 

Written By: Anabothula Bhaskar, Updated On : October 5, 2024 10:12 am

Women's T20 World Cup 2024 

Follow us on

Women’s T20 World Cup 2024  :  టి20 వరల్డ్ కప్ లో తొలిరోజు జరిగిన మ్యాచ్ లలో విజయం చివరి వరకు దోబూచులాటాడింది. అయితే అంతిమంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు చెమటోడ్చి బోణి సాధించాయి. అయితే ఈ రెండు మ్యాచ్లలో బౌలర్ల ఆధిపత్యం ప్రస్ఫుటంగా కనిపించింది. అయితే తొలి మ్యాచ్లో తలపడిన నాలుగు జట్లు పేలవమైన ఫీల్డింగ్ తో పరువు పోగొట్టుకున్నాయి. వాస్తవానికి ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో ప్రతి పరుగు చాలా ముఖ్యమైనది. ప్రతి క్యాచ్ కూడా విలువైనది. ఈ విషయం అమ్మాయిలకు తెలిసినప్పటికీ.. ఆటతీరు ప్రదర్శించారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.. ఒకటి లేదా రెండు లేదా మూడు క్యాచ్ లు వదిలిపెడితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏకంగా 13 క్యాచ్ లను జారవిడిచారు. దీంతో మ్యాచ్ లు చూస్తున్న అభిమానులు “ఇదేం ఆట తీరు రా బాబూ.. అసలు జరుగుతోంది ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీనేనా” అంటూ సామాజిక మాధ్యమాలలో విమర్శలు చేస్తున్నారు.

వరల్డ్ కప్ ప్రారంభ పోరులో బంగ్లాదేశ్ – స్కాట్లాండ్ జట్టు పోటీపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు ఆటగాళ్లకు నాలుగు సార్లు జీవదానాలు లభించాయి. బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఫీల్డర్లు తేలికైన క్యాచ్ లను పట్టుకోలేక వదిలిపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు క్యాచ్ లను అలా వదిలేశారు. ఇక స్కాట్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా తాము తక్కువ కాదని నిరూపించారు. వారు ఏకంగా మూడు క్యాచ్ లను నేలపాలు చేశారు. ఇక రెండో మ్యాచ్ రాత్రి జరగగా.. ఆ మ్యాచ్లో శ్రీలంక – పాకిస్తాన్ క్రికెటర్లు తలపడ్డారు. వారు కూడా క్యాచ్ లను వదిలేశారు. శ్రీలంక – పాకిస్తాన్ క్రికెటర్లు చెరో మూడు క్యాచ్ లను వదిలిపెట్టారు. అయితే స్వల్ప స్కోర్ నమోదైన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 31 పరుగులతో విజయం సాధించింది. గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇలా ఆటగాళ్లు క్యాచ్ లు నేలపాలు చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.” క్రికెట్ అంటే ఎంతో ఉత్కంఠ తో కూడుకున్న ఆట. అలాంటి ఆటలో గల్లి స్థాయి ప్రదర్శన చేయకూడదు. అలాంటి ప్రదర్శన చేస్తే అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు. అలాంటప్పుడు ఇటువంటి టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నామా? అని ఐసిసి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆటగాళ్లు ఆలోచించుకోవాలని” అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. గల్లి స్థాయి ఆట కాకుండా.. జెంటిల్మెన్ తరహాలో క్రికెట్ ఆడాలని సూచిస్తున్నారు. ఫీల్డింగ్ లో నిర్లక్ష్యం వహిస్తున్న ఆటగాళ్లపై వేటువేయాలని కోరుతున్నారు. అలాంటప్పుడే ఆటగాళ్లలో ఆడాలనే స్పృహ పెరుగుతుందని చెబుతున్నార