Chiranjeevi: ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి చిరంజీవి తిరుగులేని స్టార్ అయ్యాడు. మెగా ఫ్యామిలీ అనే ఒక సామ్రాజ్యం సృష్టించాడు. చిరంజీవి నట వారసులుగా ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ టాప్ స్టార్స్ అయ్యారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సైతం టైరు టు హీరోల జాబితాలో చేరారు. ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు. తమ అభివృద్ధికి కారణమైన అన్నయ్య చిరంజీవిని నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రేమిస్తారు.
అయితే ఒక సందర్భంలో నాగబాబును చిరంజీవి కొట్టారట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అయితే అది బాల్యంలో జరిగిన సంఘటన. చిరంజీవి మొదటి సంతానం కావడంతో పేరెంట్స్ కి చేదోడువాదోడుగా ఉండేవాడట. అటు చదువుకుంటూనే ఇంట్లో అన్ని పనులు చక్కబెడుతూ ఉండేవాడట. ఒకరోజు చిరంజీవి మరో పని మీద బయటకు వెళుతూ.. నాగబాబుకు పని చెప్పాడట. లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా అన్నాడట. నాగబాబు సరే అన్నాడట.
ఇంటికి తిరిగొచ్చిన చిరంజీవి.. లాండ్రీ నుండి బట్టలు తెచ్చావా? అని నాగబాబును అడిగాడట. లేదని నాగబాబు సమాధానం చెప్పాడట. దాంతో చిరంజీవికి కోపం వచ్చిందట. చెప్పిన పని ఎందుకు చేయలేదని నాగబాబును చిరంజీవి కొట్టాడట. నాగబాబు వెళ్లి తల్లి అంజనాదేవికి కంప్లైంట్ చేశాడట. అంజనాదేవి చిరంజీవి పై కోప్పడ్డారట. సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్రి వెంకట్రావు నాగబాబునే మందలించాడట. అదన్నమాట మేటర్.
కాగా ఆరెంజ్ మూవీ నిర్మించి నాగబాబు పెద్ద మొత్తంలో నష్టపోయారు. తన ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరే పరిస్థితి లేదట. తీవ్ర డిప్రెషన్ లో ఉన్న నాగబాబును మెగా బ్రదర్స్ ఆడుకున్నారట. ఈ విషయాన్ని నాగబాబు వెల్లడించారు. ముందుగా కళ్యాణ్ కి నా పరిస్థితి తెలిసింది. ఫోన్ చేసి, అప్పుల సంగతి మర్చిపో. పెద్దగా ఆలోచించకు అని హామీ ఇచ్చాడట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆదుకోవడం వలనే తాను అప్పుల ఊబి నుండి బయటపడ్డానని నాగబాబు వెల్లడించారు.
నాగబాబు ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు. జనసేన పార్టీ కీలక నేతల్లో ఆయన ఒకరు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కెరీర్ పర్లేదు. వరుణ్ తేజ్ గత రెండు చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. ప్రస్తుతం మట్కా టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మట్కా మూవీలో వరుణ్ తేజ్ లుక్ ఆసక్తి రేపుతోంది. ఇది పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్.