Boris Johnson: ట్రంప్ ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదు.. బోరిస్‌ జాన్సన్‌ సంచలన వ్యాఖ్యలు.. ఇంటర్వ్యూ వైరల్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్‌ పెంచారు.

Written By: Raj Shekar, Updated On : October 15, 2024 12:42 pm

Boris Johnson

Follow us on

Boris Johnson: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పక్షం రోజులే గడువు ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారం తారాస్థాయిలో చేస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తలు ఒడ్డుతున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఎలాన్‌ మస్క్‌తోపాటు తనకు అనుకూలంగా ఉన్నవారిని కూడా ప్రచారంలోకి దించారు. కమలా హారిస్‌ కూడా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక సర్వే సంస్థలు కూడా కాబోయే అధ్యక్షుడు ఎవరో ముందే అంచనా వేసే పనిలో ఉన్నాయి. కానీ ఓటరునాడి అంత ఈజీగా దొరకకపోవడంతో తల పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ బ్రిటన్‌ మాజీ అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌కు చెందిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటర్వ్యూలో ఆయన ట్రంప్‌ అనుకూల వ్యాఖ్యలు చేశారు.

ఒక్కరోజులో యుద్ధం ఆగేది..
ట్రంప్‌ హయాంలో ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదని బోరిస్‌ జాన్సన్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2022లో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. యుద్ధం ఒక్కరోజులోనే ముగించేవాడని పేర్కొన్నారు. యుక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా 178 బిలియన్‌ డాలర్లు అమెరికా ఖర్చు చేసిందని తెలిపారు. ఇది అమెరికా డిఫెన్స్‌ తయారీదారులకు వెళ్తుదన్నారు. ఇది మనీలాండరింగ్‌ పథకమని జాన్సన్‌ అంగీకరించాడు. ఇంత డబ్బు తిరిగి చెల్లించాలంటే ఉక్రెయిన్‌ తమ ప్రభుత్వ ఆస్తులన్నీ బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టాలన్నారు. రుణం కారణంగా అమెరికా ఉక్రెయిన్‌పై ఆంక్షలు విధించబచ్చని తెలిపారు. 30% ఇప్పటికే బ్లాక్‌రాక్‌ యాజమాన్యంలోని కంపెనీలకు విక్రయించబడింది అని తెలిపారు.

షరతులు ఇలా..

1. ఏమీ చేయకండి, మీ ఆస్తులను వదులుకోండి మరియు మీ జీతంలో 60% అద్దెకు ఖర్చు చేయండి.

2. పెరిగిన పన్నులు – ద్రవ్యోల్బణాన్ని కొనసాగించడానికి బహుళ ఉద్యోగాలు చేయండి.

3. కాలక్రమేణా విలువను పెంచే ఆస్తులను నిర్మించడం, నగదు ప్రవాహం నుండి జీవించడం మరియు తక్కువ పన్నులు చెల్లించడం