https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశాడా..? సూపర్ స్టార్ ను నిందిస్తున్న స్టార్ డైరెక్టర్..?

తెలుగు సినిమా, తమిళ్ సినిమా అనే తేడా లేకుండా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాల కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:08 AM IST

    Rajinikanth(4)

    Follow us on

    Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెబితే చాలు అభిమానులు వాళ్ల అభిమానంతో ఊగిపోతారు. అంత మంచి క్రేజ్ ను సంపాదించుకోవడంలో రజనీకాంత్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇతర హీరోల నుంచి వచ్చే పోటీని తట్టుకొని మరి నిలబడి ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో సినిమాలను చేసిన రజినీకాంత్ కొన్ని సినిమాల ద్వారా భారీ డిజాస్టర్ ని ముట్టుగట్టుకుంటే మరికొన్ని సినిమాల ద్వారా ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఎప్పటికప్పుడు తనను తాను జనరేషన్ కి తగ్గట్టుగా మార్చుకుంటూ కొత్త దర్శకులు చెప్పే కథ లను వింటూ తనను తాను ఆ పాత్రల్లో ఇమిడింప చేసుకొని సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక 73 సంవత్సరాల వయసులో కూడా ఆయన వేట్టయన్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఇక రజినీకాంత్ ఈ సినిమాతో తనదైన రీతిలో సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ ఒక సినిమాని అనవసరంగా చేశాడు అంటూ ఆయన అభిమానులు సైతం రజనీకాంత్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఆయన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో లింగా అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుడిని ఏమాత్రం ఎంగేజ్ చేయకపోగా, స్క్రీన్ ప్లే లో చాలా దారుణమైన ఫాల్స్ ఉండడం ప్రేక్షకుడికి బోర్ కొట్టించింది. దానివల్ల సినిమా మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా చూడడానికి ఎవరు ఆసక్తి చూపించకపోవడం విశేషము…

    ఇక ఈ సినిమా వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ సినిమా మీద దర్శకుడు కే ఎస్ రవికుమార్ తనదైన రీతిలో స్పందించి ఇప్పుడు పెను సంచలనాలను సృష్టిస్తున్నాడు. తను ఆ సినిమా గుర్తించి మాట్లాడుతూ ‘లింగా’ మూవీ రజినీకాంత్ ఇన్వాల్వ్ అవడం వల్లే ఫ్లాప్ అయింది అంటూ ఒక నిజాన్ని బయట పెట్టాడు. ఇక దాంతో రజినీకాంత్ అభిమానులు సైతం కే ఎస్ రవికుమార్ మీద చాలా రకాల విమర్శలైతే చేస్తున్నారు. నిజానికి కేఎస్ రవికుమార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అందులో ముత్తు, నరసింహా లాంటి సినిమాలు ఉండటం విశేషం… ఇక కేఎస్ రవికుమార్ ఎంచుకున్న కథ బాలేకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది.

    నిజానికి రజనీకాంత్ కథ విషయంలో జోక్యం చేసుకునే హీరో అయితే కాదని కె ఎస్ రవికుమార్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందంటూ రజినీకాంత్ అభిమానులు కూడా డైరెక్టర్ ను దూషిస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం రజనీకాంత్ అనవసరంగా ఆ సినిమా చేశాడు అంటూ వాళ్ళ కామెంట్లను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే లింగా సినిమా భారీ డిజాస్టర్ నివ్వడమే కాకుండా రజినీకాంత్ ను భారీ విమర్శలను కూడా ఎదుర్కొనేలా చేస్తుంది..