Homeఎంటర్టైన్మెంట్Film industry Marriages divorce reasons: పెళ్లి అయిన 20, 30 సంవత్సరాల తర్వాత సినిమా...

Film industry Marriages divorce reasons: పెళ్లి అయిన 20, 30 సంవత్సరాల తర్వాత సినిమా వాళ్ల పెళ్లిళ్లు పెటాకులు కావడానికి కారణమేంటి..?

Film industry Marriages divorce reasons: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం విషాదఛాయలు అలుముకుంటున్నాయి. సినిమాలపరంగా హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి తమ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నారు. దానివల్ల విడాకులు తీసుకుని ఎవరికి వాళ్లు సెపరేట్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా తయారవుతుండటం విశేషం… పెళ్లి చేసుకుని సంవత్సరం, రెండు సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు విడిపోతే ప్రాబ్లం లేదు. కానీ పెళ్లయి 20 – 30 సంవత్సరాలై, వాళ్ల పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఎవరికి వాళ్లు బతుకుతున్న వాళ్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో అయిన దళపతి విజయ్ నుంచి తనకు విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కింది. ఇక ఈ క్రమంలోనే ఆయన తొందరలోనే వీళ్లకు విడాకులు మంజూరు కాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక త్రిష తో తనకు ఎఫైర్ ఉండడం వల్లే ఆమె విడాకులు కోరుతున్నట్టుగా తెలుస్తుంది.

వీళ్లు కాకుండా మరికొంతమంది నటీనటులు సైతం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల విడాకులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకని సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు ఒక పెళ్లి చేసుకుంటున్నారు అంటే వాళ్లు కలకాలం కలిసి ఉంటారా? లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అందువల్లే వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు… ఇప్పుడున్న పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీని చాలామంది నమ్మడం లేదు. అలాంటిది ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరు విడాకులు తీసుకుంటూ ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఇంకొంతమంది నమ్మకం కోల్పోయే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక నాగచైతన్య సమంత ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా శర్వానంద్ సైతం విడాకుల దాకా వచ్చాడు. మరి ఆయన విడాకులు తీసుకుంటున్నాడా లేదంటే తన మనసు మార్చుకున్నాడా అనేది తెలియదు గానీ మొత్తానికైతే సినిమా వాళ్లను చేసుకుంటే అంత సేఫ్ కాదు అనే ఒక వార్త అయితే ఇప్పుడు సమాజంలో క్రియేట్ అవుతుంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular