Telugu Movies Flop: కొన్ని సినిమాల కథలు బాగున్నా ఎందుకో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. అలాంటి కోవలో నిలిచే సినిమాలు చాలా ఉన్నాయి. దర్శకుడు ఏదో కొత్తదనం కోసం ప్రయోగాత్మకంగా తీసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తాపడుతున్నాయి. దీంతో నిర్మాతలకు నష్టాలు వచ్చినా సినిమాలకు మాత్రం మంచి పేరు రావడం ఖాయమే. సినిమా కథ బాగుంటుంది కానీ పైసలు మాత్రం రావు. దీంతో ఎందుకు తీశానురా దేవుడా అని నిర్మాత తల పట్టుకోవడం తెలిసిందే. ఇలాంటి కోవలో ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ప్రయోగాత్మక సినిమాలు తీయడంలో సుకుమార్ ది ప్రత్యేక శైలి. ఆయన తీసిన సినిమాల్లో ఏదో కొత్తదనం ఉండకపోతే ఆయనకు నచ్చదు. అందుకే ఆర్య నుంచి పుష్ప వరకు తన ప్రయాణంలో ప్రతి సినిమాలో ఏదో ఒక మెలికతోనే సినిమాలు చేస్తాడు. కానీ మహేశ్ బాబు హీరోగా వన్ నేనొక్కడినే మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక అప్పటి నుంచి ప్రయోగాత్మకతకు విరామం ఇచ్చేసి మామూలుగానే సినిమాలు తీస్తున్నాడు. ఇందులో భాగంగానే పుష్ప సినిమా చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
Also Read: Smuggling Like Puspha Movie: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లా చేద్దామనుకొని అడ్డంగా బుక్కయ్యారు..
మరో దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన చిత్రాల్లో కొత్తదనం లేకున్నా హిట్లు మాత్రం ఇస్తుంటాడు. అదే మహేశ్ బాబు హీరోగా తీసిన ఖలేజా పాపులర్ కావడం అందరిని ఆశ్చర్యపరచింది. సినిమాలో కామెడీ, కథ బాగానే ఉన్నా ఎందుకో సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో దర్శకుడు నిరాశ పడకున్నా నిర్మాతకు మాత్రం కాసింత బాధే ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టినప్పుడు తిరిగి రాకపోతే ఎవరికైనా ఇబ్బందే కదా. సినిమా కథలు బాగున్నా ఎందుకో ప్రేక్షకుల మదిని మాత్రం రగిలిచించలేకపోతున్నాయి.

చిరంజీవి నటుడిగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమా కూడా అవార్డులు తెచ్చినా అమ్యామ్యాలు మాత్రం రాబట్టలేదు. ఇది కూడా నిరాశే మిగిల్చినా అవార్డులు దక్కడం విశేషం. సినిమా పరంగా ఎంతో మంచి కథతో తీసినా ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నిర్మాతకు నష్టం వచ్చినా అవార్డులు రావడం మాత్రం ఊరటే. ఇలా మంచి సినిమాలు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోనివి చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. కానీ ఎక్కడో చిన్న లాజిక్ మిస్సవుతుందో ఏమో కానీ సినిమాలు మాత్రం విజయం సాధించక నిర్మాతలకు నష్టాలనే తెస్తున్నాయి.
Also Read:Vikram Movie Tina: విక్రమ్ సినిమాలో టీనాగా నటించింది ఎవరో తెలుసా?