YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ వీకవుతోందా? ఇటీవల నిర్వహించిన పార్టీ ప్లీనరీ సక్సెస్ అయినా సీఎం జగన్‌కు మాత్రం వచ్చే ఎన్నికల్లో విజయంపై విశ్వాసం సన్నగిల్లుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తున్న నేతలు సర్కారుపై జనంలో అసంతృప్తిని గుర్తిస్తున్నారు. సంక్షేమ పథకాలే పార్టీని రెండోసారి అధికారంలోకి తెస్తాతయని భావిస్తున్నా.. అన్నిసార్లూ పథకాలు పనిచేస్తాయా? లేదా? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే మదనపడుతున్నారు. కార్యకర్తలు కూడా 2019 ఎన్నికల ముందు ఉన్నట్లుగా లేరు. నాటి ఎన్నికల్లో తెగించి పనిచేశారు. ఈసారి అలా చేస్తారా అని సొంత పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోకపోవడడమే. ప్లీనరికీ వచ్చిన క్యాడర్‌ను చూసి సంబరపడుతున్నా.. ఎన్నికల నాటికి స్ట్రాంగ్‌గా పనిచేసే అవకావంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత..
వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పీఆర్సీ అమలు, పీఎఫ్ సొమ్ము కనిపించకుండా పోవడం, వేతనాల చెల్లింపులో జాప్యం, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండకపోవడం, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలలో తెలియని పరిస్థితి ఉండడం ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేక భావన ఏర్పడుతోంది. గత ఎన్నికలల్లో టీడీపీ ఓటమిలో ఉద్యోగులు కీలక పాత్ర పోసించారు. ఎన్నికల నాటికి ఉద్యోగులతో సఖ్యతగా లేకుంటే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన ఎమ్మెల్యేల్లో వక్తమవుతోంది. 2019 ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు 90 శాతం మంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ‘మొన్న జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నా.. అక్కడ వైసీపీ నేతలు ఉద్యోగుల నుంచి పోస్టల్ బ్యాలట్లు సేకరించి వారే ఓట్లు వేశారు‘ అని ఎమ్మెల్యేలే పేర్కొంటున్నారు.. పోస్టల్ బ్యాలెట్లను చూసి ఉద్యోగులంతా తమవైపే ఉన్నారనుకుని మురిసిపోతే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదని చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసమా.. అతి విశ్వాసమా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదనే భావనలో ఉన్నారు జగన్. కానీ అది పొరపాటే అంటున్నారు సొంత పార్టీ నేతలు. విపక్షాలన్ని కలసి పోటీ చేసినా తమను ఏం చేయలేరని స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆత్మవిశ్వాసం అనేకంటే అతివిశ్వాసమనే చెప్పాలని ఎమ్మెల్యేల అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జన సేనను లైట్ తీసుకోవద్దని పేర్కొటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీలకు పడుతుందని చెబుతున్నారు.

కసితో టీడీపీ క్యాడర్…
టీడీపీని తేలిగ్గా అంచనా వేయలేమంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. తాము నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం కాబట్టి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ రాష్ట్రంలో టీడీపీయే అంటున్నారు. వైసీపీకి ప్రతీ బూత్‌లో క్యాడర్ ఉన్నప్పటికీ టీడీపీ క్యాడర్‌కు మించిన కసి వారిలో కన్పించడం లేదు. ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అనవసర కేసులు పెట్టడం, వారిని అన్ని రకాలుగా గ్రామాల్లో అవమానపర్చడంతో టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న పట్టుదల ఆ పార్టీ క్యాడర్‌లో పెరుగుతోంది. వైసీపీ క్యాడర్ ప్రస్తుతం నిస్తేజంగానే కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో కొన్ని ప్రధాన వర్గాలు ఇప్పటికే దూరమయినట్లు చెబుతున్నారు. గ్రౌండ్ లెవల్ రియాలిటీ జగన్‌కు త్వరగా తెలియాలని కోరుకుంటున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.