Homeఎంటర్టైన్మెంట్Ileana: 'ఇలియానా' కోరిక తీర్చే ఆ హీరో ఎవరో ?

Ileana: ‘ఇలియానా’ కోరిక తీర్చే ఆ హీరో ఎవరో ?

Ileana: ‘హీరోయిన్ ఇలియానా’కి ఇంకా ఒక కోరిక మిగిలిపోయిందని తెగ ఇదైపోతూ ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధ పడుతుంది. ఇంతకీ ఆ కోరిక ఏమిటనేగా.. బాలీవుడ్ లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో మసాలాకే సెగ పుట్టేలా ఒక బోల్డ్ సాంగ్ చేయాలని ఇలియానా ఎప్పటి నుంచో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అయితే, ఇలియానాకి ఛాన్స్ ఇచ్చే హీరో మాత్రం దొరకడం లేదు. అజయ్ దేవగణ్ తో, అలాగే అక్షయ్ కుమార్ తో కూడా ఇలియానా చాలా క్లోజ్ గా మూవ్ అయింది.

Ileana
Ileana

అక్షయ్ కుమార్ ఆమెకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. అయినా ఆ సినిమా ఆమెకు ఏ రకంగానూ ప్లస్ కాలేదు. అందుకే, బాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించాలి అంటే.. మంచి మసాలా సాంగ్ ఒకటి తనకు పడాలి అని ఇలియానా కోరుకుంటుంది. ఎప్పటి నుండో ఇలియానాకి ఆ కోరిక ఉందట. బాలీవుడ్ లో ఇప్పటికే ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించింది. ఇంకా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది. మరి, ఈ ఐటమ్ కోరిక ఎందుకు..? హిందీ జనాన్ని త్వరగా ఆకట్టుకోవాలి అంటే..

Also Read: ఛాన్స్ కోసం ‘రకుల్’ ఆరాటం.. కోటి కోసం ‘ప్రగ్యా’ పోరాటం !

మంచి బోల్డ్ సాంగ్ లో పరిధులు దాటేసి రెచ్చిపోయి నటిస్తే త్వరగా రీచ్ ఉంటుందని ఇలియానా చెప్పుకొస్తోంది. తెలుగు, తమిళ సినిమాల్లో అలా చేసే స్టార్ డమ్ ను సంపాదించాను అంటూ ఈ బ్యూటీ ఇన్ డైరెక్ట్ గా చెబుతుంది. నిజానికి హిందీలో కూడా ఫుల్ మసాలా డాన్స్ చేయాలని ప్రయత్నం చేసినా సరైన ఛాన్స్ రాలేదు. అందుకే ప్రస్తుతం ఇలియానా మెయిన్ టార్గెట్ తనకు మిగిలిన ఆ ఒక్క కోరిక తీర్చుకోవడమేనట.

Ileana
Ileana

మరి ఇలియానా బలంగా కోరుకుంటున్న ఆ ఒక్క అవకాశం ఆమెకు దక్కుతుందా ? ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందుకే తన మకాంను కూడా ముంబైకే మార్చేసింది. ముంబైలోనే కొత్తగా ఒక విల్లా కూడా కొనుక్కుంది. అయితే ఇలియానా హిందీలో బిజీ కాకపోవడం వెనుక చాల వ్యవహారాలే ఉన్నాయని టాక్. ముఖ్యంగా దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడంలో ఇలియానా ఎక్స్ పెక్ట్ అని, అలాగే హీరోల ఇగోలకు తగ్గట్టు నడుచుకుంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇలియానా కోరిక తీర్చే ఆ హీరో ఎవరు ? చూడాలి.

Also Read: గల్ఫ్ దేశాలపై క్షిపణలు, బాంబు దాడులు.. మళ్లీ పెట్రోల్ డీజీల్ పైపైకేనా?

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

2 COMMENTS

  1. […] PRC Issue in AP:  ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా ముదురుతున్నది. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ ఉత్వర్వులతో ఈ వివాదం తెర మీదకు వచ్చింది. పీఆర్సీ విషయమై ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. సమ్మె బాట పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో చర్చించేందుకుగాను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అలా ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు నిర్వహించాలని ఏపీ సర్కారు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానిలకు బాధ్యతలు అప్పజెప్పింది. కాగా, ఉద్యోగ సంఘాల నేతలకు చర్చల సమయంలో మంత్రులకు గట్టి షాక్ ఇచ్చినంత పని చేశారు. ఇంతకీ వారు ఏం చేశారంటే.. […]

  2. […] Undavalli Arun Kumar: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో రెండు వర్గాలుగా మారిపోయి తాము అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. ఏపీలో కొనసాగుతున్న అనిశ్చితికి పరిష్కార మార్గం చూపేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నడుం బిగించారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ రెండు వర్గాల్లో సమన్వయం సాధించేందుకు చొరవ చూపుతున్నారు. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. […]

Comments are closed.

Exit mobile version