Cinema Gossips: ఛాన్స్ కోసం ‘రకుల్’ ఆరాటం.. కోటి కోసం ‘ప్రగ్యా’ పోరాటం !

Cinema Gossips: మొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయినా టాలీవుడ్ డైరెక్టర్స్‌ తీస్తున్న పాన్ ఇండియా మూవీల్లో తనకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని కోరింది. తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాట్లాడగలనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చివరగా తెలుగులో కొండపొలం మూవీలో హీరోయిన్‌గా నటించింది రకుల్. ఇక మరో హీరోయిన్ విషయానికి వస్తే… ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా ప్రగ్యా […]

Written By: Raghava Rao Gara, Updated On : January 24, 2022 4:38 pm
Follow us on

Cinema Gossips: మొన్నటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయినా టాలీవుడ్ డైరెక్టర్స్‌ తీస్తున్న పాన్ ఇండియా మూవీల్లో తనకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని కోరింది. తాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మాట్లాడగలనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చివరగా తెలుగులో కొండపొలం మూవీలో హీరోయిన్‌గా నటించింది రకుల్.

Rakul Preet Singh

ఇక మరో హీరోయిన్ విషయానికి వస్తే… ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు దాటిపోయినా ప్రగ్యా జైస్వాల్ మొన్నటి వరకు ఒక్క బ్లాక్‌బస్టర్ అందుకోలేకపోయింది. అందాలు ఆరబోసినా ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి సమయంలో బాలయ్యతో నటించిన అఖండ సంచలన విజయంతో.. అవకాశాలు వస్తాయని ఫిక్స్ అయిపోయింది. అందుకే తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు రేట్ పెంచి భయపెడుతుంది ప్రగ్యా. కొత్త సినిమాలకు ఏకంగా రూ. కోటి కావాలని అడుగుతోందట. అఖండకు రూ.30లక్షల వరకు తీసుకుందని సమాచారం.

Also Read:  గల్ఫ్ దేశాలపై క్షిపణలు, బాంబు దాడులు.. మళ్లీ పెట్రోల్ డీజీల్ పైపైకేనా?

 

Pragya Jaiswal

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా ‘డీజే టిల్లు’ సినిమా రూపొందింది. సితార – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పట్టాసు పిల్లా.. పట్టాసు పిల్లా’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా, సంగీతదర్శకుడు అనిరుధ్ ఆలపించాడు. అయితే, ఈ సాంగ్ లో తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా నటించిందని తెలుస్తోంది.

Also Read:  త్వ‌ర‌లోనే మీరు కోలుకోవాలి స‌ర్ – మెగాస్టార్ చిరంజీవి

Tags