Homeక్రీడలుVirat kohli- Anushka Sharma: అనుష్కను పెళ్లిచేసుకోవడంతోనే విరాట్ కు కష్టాలా?

Virat kohli- Anushka Sharma: అనుష్కను పెళ్లిచేసుకోవడంతోనే విరాట్ కు కష్టాలా?

Virat kohli Anushka Sharma: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్ పై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆయన ఫిట్ నెస్ పై సందేహాలు వస్తున్నాయి. దీంతోనే ఆయన కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దశలో అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడంతోనే విరాట్ కోహ్లీలో టాలెంట్ తగ్గిందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరాట్ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Virat Kohli and Anushka Sharma
Virat kohli- Anushka Sharma:

విరాట్ కోహ్లి వైవాహిక జీవితంతోనే జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నాడని పలు ఆసక్తికర కామెంట్లు సైతం వస్తున్నాయి. వివాహం తరువాత జీవితంలో సాధించాల్సినవి మరుగున పడిపోతాయనే విషయం విరాట్ కు తెలియదా? దీంతో అతడు తన కెరీర్ ను అర్థంతరంగా ముగించాల్సి వస్తోందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి పెళ్లి చేసుకుని ఓ పెద్ద తప్పు చేశాడని కొందరు వాదిస్తున్నారు.

Also Read: ఛాన్స్ కోసం ‘రకుల్’ ఆరాటం.. కోటి కోసం ‘ప్రగ్యా’ పోరాటం !

టీమిండియాకు బాధ్యతలు వహించడం అందరికి వీలు కాదు. అలాంటి అవకాశం దొరకడం నిజంగా అదృష్టమే. అందుకే విరాట్ తన పెళ్లిని కొంత కాలం వాయిదా వేసుకుంటే మరిన్ని అద్భుతాలు సృష్టించేవాడని తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ తరువాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం తెలిసిందే. ఆ తరువాత వెంట వెంటనే వన్డే జట్టు, టెస్ట్ సిరీస్ లకు కూడా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం అందరికి సుపరిచతమే.

Virat kohli- Anushka Sharma:
Virat kohli- Anushka Sharma:

అభిమానుల అంచనాలన్ని తలకిందులు చేస్తూ విరాట్ కోహ్లి తన ప్రదర్శనలో మెరుగైన ఆటను కనబరచలేకపోతున్నాడు. ఫలితంగానే ఆయన బంగారు భవిష్యత్ కాస్త ఆందోళనకర స్థాయికి చేరింది. ఇన్నాళ్లు స్టార్ ఆటగాడిగా వెలుగొందిన కోహ్లికి ప్రస్తుతం ఎదురుదెబ్బలే తగలుతున్నాయి. 14 ఏళ్లుగా భారత జట్టుకు సేవలందించినా ప్రస్తుతం అతడి చుట్టు విమర్శలే వస్తున్నాయి.

కోహ్లి లాంటి గొప్ప బ్యాట్స్ మెన్ పరుగులు సాధించడంలో తనదైన ప్రత్యేక శైలి. దీంతో ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. విరాట్ జీవితంపై ఎన్నో ఊహలు మెరిసినా చివరికి మాత్రం ఎటు కాకుండా పోవడంతో విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తానికి వివాహం చేసుకుని విరాట్ పెద్ద పొరపాటు చేశాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read:  గల్ఫ్ దేశాలపై క్షిపణలు, బాంబు దాడులు.. మళ్లీ పెట్రోల్ డీజీల్ పైపైకేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version