Homeఎంటర్టైన్మెంట్Sankranti 2027 Movies: 2027 సంక్రాంతి విన్నర్ గా నిలిచేది ఎవరు..?సీనియర్ హీరోలు అసలు తగ్గడం...

Sankranti 2027 Movies: 2027 సంక్రాంతి విన్నర్ గా నిలిచేది ఎవరు..?సీనియర్ హీరోలు అసలు తగ్గడం లేదుగా..?

Sankranti 2027 Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు… ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమాలను చేస్తూ వచ్చారు… ఒక్కొక్కరికి ఒక్కో జానర్లో చాలా మంచి పట్టు ఉండడంతో డిఫరెంట్ జానర్స్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీని గత 50 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళుతున్న ఘనత వీళ్ళకే దక్కింది. ఈ నలుగురు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలు తక్కువనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత 2027 సంక్రాంతికి ఈ నలుగురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు… వీళ్ళలో ఎవరు పై చేయి సాధిస్తారు? ఎవరు ఎవరిని డామినేట్ చేసి విజయాన్ని అందుకుంటారు? అనేది తెలియాల్సి ఉంది. సీనియర్ హీరోలందరు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఎవ్వరు తగ్గే అవకాశమైతే లేదు. సక్సెస్ ఫుల్ కంటెంట్ ని తీసుకొచ్చిన వారికి మాత్రమే విజయం దక్కుతుంది… రొటీన్ పంథా లో వెళ్తే ప్రేక్షకులు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది.

కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు ఈ సినిమాలతో ఈ నలుగురు హీరోలు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్ కి వెళ్లబోతున్నారు అనేది తెలియాలంటే మాత్రం 2027 సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే…ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని తన అభిమానులకు సంక్రాంతి గిఫ్టునైతే ఇచ్చాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే వచ్చే సంక్రాంతికి సైతం చిరంజీవి తన సత్తా చాటితే వరుసగా రెండు సంక్రాంతులకు విజయాలను అందుకున్న వాడవుతాడు…ఇక బాలయ్య బాబుకి సైతం సంక్రాంతి సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నరసింహ నాయుడు, వీర సింహరెడ్డి, డాకూ మహారాజ్ సినిమాలతో సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఆయన సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు.

నాగార్జున కూడా ఇంతకుముందు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు కూడా ఆయన విజయాన్ని అందుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. వెంకటేష్ సైతం ఇంతకుముందు కలిసుందాం రా, ఎఫ్ 2 లాంటి సినిమాలతో సంక్రాంతి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆ సక్సెస్ లను రిపీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper
Exit mobile version