Homeబిజినెస్Lava Bold N2: వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్న రూ.5,999 మొబైల్.. ఇది ఏ...

Lava Bold N2: వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్న రూ.5,999 మొబైల్.. ఇది ఏ కంపెనీది అంటే?

Lava Bold N2: స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునే వారిలో కొందరు ఖరీదైన వాటి గురించి ఆలోచిస్తే.. మరికొందరు బడ్జెట్లోనే కొనాలని చూస్తారు. రోజువారి అవసరాలతో పాటు.. బిజీగా ఉండేవారు సాధారణ మొబైల్ కొనాలని ఆలోచిస్తారు. ఇలాంటి వారి కోసం దేశీయ కంపెనీ అయిన Lava ఆకర్షణీయమైన మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. దీని నుంచి ఇప్పటికే వెలువడిన Bold N1 ఎక్కువగా ఆదరణ పొందింది. ఆ తర్వాత ఇదే వెర్షన్ Pro కూడా రిలీజ్ అయింది. ఈ మొబైల్స్ లో బ్యాటరీ పర్ఫామెన్స్ ఎక్కువగా ఉండడంతో వీటిని ఎక్కువగా ఆదరించారు. అయితే ఇప్పుడుBold N1 సీక్వెల్ గా కొత్త మొబైల్ రాబోతుంది. దీని వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ ఫోన్ ధర కూడా తక్కువగానే ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

మిడిల్ క్లాస్ పీపుల్స్ తో పాటు రోజువారి అవసరాల కోసం Lava కంపెనీ ఫోన్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇవి తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతోపాటు ప్రీమియం ఫోన్లో ఉండే ఫీచర్లు కనిపిస్తాయి. ఇందులో భాగంగా కొత్తగా వచ్చే Lava Bold N2 మొబైల్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ స్పెషల్ గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు స్క్వేర్ డిజైన్ కలిగి ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. నేటి కాలంలో చాలామంది మొబైల్ లో కెమెరా గురించి ఆరాధిస్తున్నారు. అయితే Lava Bold N2 మొబైల్ లో 13 MP కెమెరా ఉండనుంది. ఈ కెమెరా అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించేందుకు అవకాశం ఉంటుంది. సెల్ఫీ కోసం తక్కువ మెగాపిక్సల్ ఉన్నప్పటికీ కావలసిన ఫోటోగ్రఫీని పొందవచ్చు. . అంతేకాకుండా వీడియో కాలింగ్ కోసం కూడా అనుగుణంగా ఉంటుంది.

ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చినLava Bold N1 మొబైల్ లో 5000 mAh బ్యాటరీ ఉంచారు. ఇప్పుడు కొత్తగా రాబోయే N2 మొబైల్ లో కూడా ఇదే బ్యాటరీ ఉండనుంది. ఇది 10 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. రోజంతా వినియోగించే వారికి ఈ బ్యాటరీ సరిపోయే అవకాశం ఉంది. దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చిన తర్వాత రూ.5,999 తో విక్రయించే అవకాశం ఉంది. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు.. వివిధ అవసరాల కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు. వచ్చే నెలలో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version