Funky Movie : ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి..ఒకరి పనిలోకి మరొకరు దూరితే ఫలితాలు మొత్తం తారుమారు అవుతాయి. సినీ ఇండస్ట్రీ లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూసాము. సినిమా ఫ్లాప్ అయితే చివరికి తిట్లు , చివాట్లు డైరెక్టర్ మాత్రమే ఎదురుకోవాలి. నిన్న విడుదలైన ‘ఫంకీ'(Funky Movie) సినిమాకు అదే జరిగింది. ‘జాతి రత్నాలు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన డైరెక్టర్ అనుదీప్ నుండి ఇలాంటి ప్రోడక్ట్ వచ్చింది ఏంటి?, కథలో సన్నివేశాలు ఉన్నట్లుగా లేదు, సన్నివేశాల కోసమే కథ రాసుకున్నట్టు ఉంది, ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఫ్లోలో లేదు, డైరెక్టర్ అనుదీప్ KV మేకింగ్ స్టైల్ ఇంతేనా?, లేకపోతే ఎక్కడైనా ఏదైనా తేడా జరిగిందా అని సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. నిజానికి కచ్చితంగా తేడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనుదీప్ KV ఒక ఫ్లో లో చాలా చక్కగా, నీట్ గానే తెరకెక్కించాడట. కానీ ఎడిటింగ్ టీం ఇచ్చిన సలహాలను గుడ్డిగా అనుసరించడం వల్ల, డైరెక్టర్ కి స్వేచ్ఛ ని ఇవ్వకపోవడం వల్లే, ఫైనల్ ఔట్పుట్ ఇలా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక రూమర్. ఒకవేళ అనుదీప్ కి పూర్తి స్థాయి స్వేచ్ఛ ని ఇచ్చి ఉండుంటే కచ్చితంగా జాతి రత్నాలు రేంజ్ సినిమాని ఇచ్చేవాడేమో. సినిమా చూస్తున్నంత సేపు ఎడిటింగ్ చాలా గందరగోళంగా ఉన్నట్లు అనిపించింది. అంతే కాదు టెక్నీకల్ గా కూడా ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల డబ్బింగ్ ఒక్కరికి కూడా సింక్ లో కుదర్లేదు. ఇంత నిర్లక్ష్యానికి కారణం డైరెక్టరా?, లేదా ఎడిటరా?, ఈ విషయం లో ఇద్దరిది తప్పు ఉందనే చెప్పాలి. ఆడియన్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ఇలాంటి ప్రొడక్ట్స్ ని అందిస్తే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ నే క్షమించలేదు, ఇక ఇలాంటి చిన్నవాళ్లు ఎంత అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్ కేవలం రెండు కోట్ల రూపాయిలు మాత్రమే, ఇంకా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అనుదీప్ కి యూత్ ఆడియన్స్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా వీకెండ్ వరకు ఒక మోస్తారు కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ఫలితాన్ని అందుకోక తప్పదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
#Exclusive :
పాపం,డైరెక్టర్ బంగారు కోడిపెట్టనే రెడీ చేశాడట…కానీ ఫైనల్ గా ఈకలు పీకిన కోడిని చేశారట.
డైరెక్టర్ పని డైరెక్టర్ చెయ్యాలి…ఎడిటర్ ఎడిటింగ్ మాత్రమే చెయ్యాలి,మహా అయితే సలహాలు ఇవ్వాలి కానీ డెసిషన్స్ తీసుకోకూడదు.— Taraq(Tarak Ram) (@tarakviews) February 14, 2026