Sankranti : సినిమా ఇండస్ట్రీలో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క స్టార్ ప్రొడ్యూసర్ కూడా తమ సినిమాని రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక దానికోసమే ముందు నుంచే పండుగ సీజన్లను బుక్ చేసుకుంటూ ఉంటారు… దీనివల్ల మిగతా హీరోలు కూడా పండగ సీజన్ కి రావాలనుకునేవారు తప్పుకునే అవకాశాలైతే ఉంటాయి. ఇంకా ఎవరూ ఆ డేట్ ని బుక్ చేసుకోకుండా నిర్మాతలు మెయింటెన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి పండుగ సీజన్ లో భారీ కలెక్షన్ ను కొల్లగొట్టి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచేవారు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకున్నప్పటికి తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ ముందు ఉన్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి కానుక గా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అనే మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించబోతుంది. ఏ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టబోతుందనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే సంక్రాంతి విన్నర్ గా ‘గేమ్ చేంజర్’ సినిమా నిలవబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మిగిలిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించినప్పటికి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ‘డాకు మహారాజ్ ‘ , ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుండడం వల్ల ఈ సినిమాలకు భారీ కలెక్షన్స్ వచ్చినప్పటికి అవి తెలుగుకు మాత్రమే పరిమితం అవుతూ ఉండటం వల్ల గేమ్ చేంజర్ సినిమాతో పోల్చుకుంటే కొంతవరకు కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయనే చెప్పాలి.
ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియాలో వస్తు భారీ రికార్డులను క్రియేట్ చేయడానికి ముందుకు సాగుతుంది. అలాగే ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో పెట్టారు. కాబట్టి కలెక్షన్స్ రూపంలో కూడా రికార్డులను కొల్లగొట్టే దిశగా ముందుకు సాగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ మూడు సినిమాలతో 2025 సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ మూడు సినిమాలు మంచి సక్సెస్ లను సాధించి రాబోయే సినిమాలకు కూడా మార్గదర్శకంగా మారబోతున్నాయనే విషయమైతే తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించిన భారీ ప్రమోషన్స్ చేస్తూ తమదైన రీతిలో సత్తా చాటే ప్రయత్నం కూడా చేస్తున్నారు… చూడాలి మరి ఏ సినిమా భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది…