https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Bigg Boss 5 Telugu: గత నాలుగు సీజన్ల కంటే కూడా ఈసారి అత్యధిక మందితో.. అత్యధిక మసాలాతో తెలుగు బిగ్ బాస్ మొదలైంది. సహజంగా 15, 16 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తుంటారు. కానీ ఈసారి అంతకుమించి 19మందితో బిగ్ బాస్ హౌస్ ను నిండా నింపేశారు. హోస్ట్ నాగార్జున గత ఆదివారం షోను గ్రాండ్ లాంచ్ చేశాడు. ఈసారి ప్రముఖులను, సినీ, టీవీ సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడంతో […]

Written By: , Updated On : September 8, 2021 / 01:48 PM IST
Follow us on

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: గత నాలుగు సీజన్ల కంటే కూడా ఈసారి అత్యధిక మందితో.. అత్యధిక మసాలాతో తెలుగు బిగ్ బాస్ మొదలైంది. సహజంగా 15, 16 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తుంటారు. కానీ ఈసారి అంతకుమించి 19మందితో బిగ్ బాస్ హౌస్ ను నిండా నింపేశారు. హోస్ట్ నాగార్జున గత ఆదివారం షోను గ్రాండ్ లాంచ్ చేశాడు.

ఈసారి ప్రముఖులను, సినీ, టీవీ సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడంతో అందరి కళ్లు వారిపైనే ఉన్నాయి. యాంకర్ రవి, షణ్ముఖ్, ఆనీ మాస్టర్, నటి ప్రియ లాంటి తెలిసిన ముఖాలు ఎంతో మంది ఉన్నారు. ఇక తొలి రోజు నుంచే బిగ్ బాస్ లో గొడవలు, లొల్లిలు మొదలు కావడం కాకరేపింది.

బిగ్ బాస్ మొదలై మూడు రోజులే అయినా కూడా వాడివేడిగా సాగుతోంది. మాటల తూటాలు, గొడవలు, ఏడుపులు , పెడబొబ్బలతో ఈసారి అంతకుమించిగా నడుస్తోంది. రెండో రోజే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నామినేషన్ లో యాంకర్ రవి, సరయు, జస్వంత్, హమీద, మానస్, కాజల్.. ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు.

ఈ మూడు రోజుల ఎపిసోడ్లు చూస్తుంటే తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరనేది ఈజీగా ఐడెంటిఫై అవుతోంది. హౌస్ మొత్తంలోనే చాలా దురుసుగా, అహంభావంతో వ్యవరిస్తూ అందరినీ అవమానిస్తున్న జశ్వంత్( జెస్సీ) (Jashwanth) తొలి వారం ఎలిమినేట్ కావడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.

జెస్సీ ఒక సూపర్ మోడల్. ఫ్యాషన్ సర్కిల్స్ లో హైదరాబాద్ మిలింద్ సోమన్ అంటారు. 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. నామినేషన్ సందర్భంగా కంటెస్టెంట్లతో గొడవ పెట్టుకొని అనంతరం కన్నీళ్లు పెట్టుకొని వివాదాస్పదుడిగా జశ్వంత్ ముద్రపడిపోయాడు. అయితే తాజాగా నిన్న ఆనీ మాస్టర్ తో దురుసగా ప్రవర్తించి కాళ్లు ఆమె ముందే చాచి రూడ్ గా ప్రవర్తించాడు. ఆనీ మాస్టర్.. జెస్సీని కడిగిపారేసింది. తిట్ల వర్షం కురిపించింది. ఆనీ మాస్టర్ పై జెస్సీ ఊగిపోవడం.. కొట్టడానికి పోవడంతో అతడి ప్రవర్తన నెగెటివ్ గా ప్రొజెక్ట్ అయ్యింది. ఇంటి సభ్యులంతా జెస్సీదే తప్పు అన్నారు.

ఊరికే ఏడుస్తూ.. లేదంటే గొడవ పడుతూ జెస్సీ కనిపిస్తున్నాడు. విభిన్న మనస్తత్వాల మధ్య గడపలేకపోతున్నాడు. దీంతో ప్రేక్షకుల దృష్టిలో విలన్ అయిపోతున్నాడు. ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతడేనని అంటున్నారు.