Homeఎంటర్టైన్మెంట్Sobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్...

Sobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అతని బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే హడలిపోతారు!

Sobhita Dhulipala:నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత నటి శోభితా ధూళిపాళ ట్రెండింగ్‌గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా వారి గురించే చర్చ నడుస్తోంది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో కనెక్ట్ అయ్యాడు. కొద్ది రోజులుగా ఆమెతో సీక్రెట్ గా డేటింగ్ కొనసాగించారు. డేటింగ్ రూమర్స్ వార్తల్లో ఉన్నప్పుడు చైతు దానిపై స్పందించలేదు. అలాంటిదేమీ లేదని శోభిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మధ్య చై-శోభిత జర్మనీలో కనిపించగా, చై-శోభిత రిలేషన్ షిప్ లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగింది.

అదే నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ ప్రకటనతో వారు తమ మధ్య ఉన్న సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 8న నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది. స్వయంగా హీరో నాగార్జున అక్కినేని నిశ్చితార్థం ఫొటోలను కూడా విడుదల చేశారు. దీంతో శోభిత కుటుంబ నేపథ్యం, గత సంబంధాలపై అందరూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో శోభితకు గతంలో ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రిలేషన్ షిప్ సమయంలో అతనితో కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శోభిత మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మోడల్‌గా రాణిస్తున్న సమయంలో ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు ప్రణవ్ మిశ్రాతో ప్రేమలో పడింది. ఆమె అతనితో కొంతకాలం డేటింగ్ చేసింది. 2019 లో వారు ఒక ఫ్యాషన్ షోలో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా మారింది. అలా కొంత కాలంగా శోభిత, ప్రణవ్ ప్రేమలో పడ్డారు. తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వారి విడిపోవడానికి అసలు కారణం తెలియరాలేదు.

అయితే నాగ చైతన్య కంటే ముందే ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ తో శోభిత ప్రేమాయణం సాగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే తెలుగులో కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసింది శోభిత.. ఆమె మే 31, 1992న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించారు. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 గెలిచిన తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది యాక్షన్‌ థ్రిల్లర్‌ మంకీ మ్యాన్‌తో దేవ్‌ పటేల్‌ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో గూడచారి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభిత. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో నటించని పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version