Akkineni Akhil Engagement: డిసెంబర్ 4న నాగ చైతన్య వివాహం జరగనుంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో కేవలం 300 మంది ప్రత్యేక అతిథులు, సన్నిహితులు, బంధువుల మధ్య ఈ వేడుక జరగనుంది. పెళ్లి సింపుల్ గా చేసుకోవాలని నాగ చైతన్య, శోభిత నిర్ణయించుకున్నారట. అందుకే నాగార్జున నిరాడంబరంగా ముగిస్తున్నారట. టాలీవుడ్ ప్రేక్షకులు నాగ చైతన్య పెళ్లి మూడ్ లో ఉండగా.. మరో సర్ప్రైజింగ్ ప్రకటన చేశాడు నాగార్జున
చిన్న కొడుకు అఖిల్ కి కూడా నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. అఖిల్, కాబోయే కోడలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొత్త జంటను ఆశీర్వదించాలని కోరారు. ఇది టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఒక ప్రక్క నాగ చైతన్య పెళ్లి వేడుకలు జరుగుతుండగా.. అఖిల్ నిశ్చితార్థం అందరికీ షాక్ ఇచ్చింది. అందులోనూ అఖిల్ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు. మీడియాలో లీక్స్ రాలేదు. అందుకే ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నిఖిల్ కి కాబోయే భార్య పేరు జైనాబ్ రవ్డ్జీ. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్డ్జీ కుమార్తె. జుల్ఫీ తో నాగార్జునకు చాలా కాలంగా పరిచయం ఉంది. వీరిద్దరూ మిత్రులు అని సమాచారం. అలాగే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా జుల్ఫీకి సన్నిహితుడు అని తెలుస్తుంది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.. జైనాబ్ రవ్డ్జీ వయసులో అఖిల్ కంటే పెద్దది అట. వీరిద్దరి మధ్య 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు.
కాగా 2016లో శ్రేయా భూపాల్ అనే అమ్మాయితో అఖిల్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం తెలియదు కానీ ఈ వివాహం రద్దు అయ్యింది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం అఖిల్ పెళ్ళికి సిద్ధం అయ్యాడు. మరోవైపు అఖిల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. అఖిల్ కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..
Web Title: Who is zainab does akhil know the background of his future wife
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com