Akhil Wife: రీసెంట్ గానే నాగార్జున(Akkineni Nagarjuna) చిన్న కొడుకు అక్కినేని అఖిల్(Akkineni Akhil) జైనబ్(Jainab Akkineni) ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకుంది ఈ జంట. అయితే అఖిల్ కంటే జైనబ్ వయస్సు లో చాలా పెద్ద. అఖిల్ కి 32 ఏళ్ళు ఉంటే, జైనబ్ రీసెంట్ గానే తన 40 వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గానే ఆమె పుట్టినరోజు వేడుకలకు అక్కినేని నాగార్జున, అఖిల్ మరియు నాగ చైతన్య లు కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. అఖిల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు వచ్చిన మొట్టమొదటి పుట్టినరోజు ఇది. ఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరు అయ్యింది. కానీ నాగచైతన్య(Akkineni Naga Chaitanya) సతీమణి శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) మాత్రం ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
జైనబ్ పుట్టినరోజు వేడుకలకు రాలేదంటే, శోభిత కి ఆమెకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా?, ఒకే కుటుంబం లో ఉన్న తర్వాత పెద్ద కోడలు, చిన్న కోడలు మధ్య ఆధిపత్య పోరు కచ్చితంగా ఉంటుంది. అలాంటి పోరు వీళ్లిద్దరి మధ్య కూడా ఉందా అంటూ ఇలా రకరకాల కథనాలు, ఊహాగానాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వచ్చాయి. కానీ అలాంటిదేమి లేదని, శోభిత షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం వల్లే రాలేకపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రీసెంట్ గానే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షూటింగ్ లొకేషన్స్ లో కూర్చొని వంట చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేయడం మనమంతా చూసాము. అంటే ఆమె నిజంగానే ముంబై లో షూటింగ్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా ఎలాంటి అపోహలు అక్కినేని అభిమానులు పెట్టుకొనవసరం లేదని అంటున్నారు.
ఇకపోతే ఈ ఏడాది సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీ కి బాగానే కలిసొచ్చింది. ఏడాది ప్రారంభం తండేల్ చిత్రం తో నాగచైతన్య భారీ బ్లాక్ బస్టర్ ని అందుకుంటే, కుబేర మరియు కూలీ చిత్రాలతో నాగార్జున కూడా భారీ హిట్స్ ని అందుకున్నాడు. కానీ కూలీ చిత్రం లో నాగార్జున విలన్ క్యారక్టర్ చేయడం పై అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దయచేసి ఇలాంటి క్యారెక్టర్స్ చేసి అక్కినేని కుటుంబం గౌరవం ని పాడు చేయొద్దు అంటూ సోషల్ మీడియా లో నాగార్జున ని ట్యాగ్ చేసి వేడుకున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా సంగతి పక్కన పెడితే నాగార్జున తదుపరి చిత్రం వంద చిత్రం. ఇందులో ఆయన హీరో గానే నటిస్తున్నాడు. అక్కినేని అభిమానులు తన నుండి ఎలాంటి యాక్షన్ చిత్రాన్ని కోరుకుంటున్నారో, అలాంటి యాక్షన్ చిత్రమే నాగార్జున చేస్తున్నాడు, మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.