Tollywood
Tollywood: చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనను విస్తరించుకుంటూ తన స్థానాన్ని ఎవరు ఊహించని రేంజ్ లో నిలబెట్టుకున్నారు. ఈయన ఎవరి వల్లనో స్టార్ కాలేదు. ఈయన సెల్ఫ్ మేడ్ స్టార్ అనడంలో సందేహం లేదు. అయితే ఈయన ఈస్థాయికి చేరడానికి చాలా కష్టపడ్డారు. మరి అచ్చం చిరంజీవిలా తన స్థానాన్ని కష్టపడుతూ పదిలం చేసుకున్నా ఈ తరం స్టార్ ఎవరు? ఆయన స్థానాన్ని బర్తీ చేసే సత్తా ఎవరికి ఉంది? అనే ప్రశ్న ఎందరిలోనో మెదులుతుంది.
ఈ ప్రశ్నకు ప్రభాస్, ఎన్టీఆర్ లు అనే సమాధానాలు వినిపిస్తుంటాయి. ఇక ప్రభాస్ తన యాక్టింగ్ టాలెంట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలంటూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడి ఎలాంటి రోల్ వచ్చినా తన నటనతో సులువుగా ప్రేక్షకులను మెప్పిస్తారు. ఇలాంటి టాలెంట్ ఈయన సొంతం.
మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం చిరంజీవి తర్వాత స్థాయి తమ హీరోలకే సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఆ రేంజ్ ఉన్నా కూడా ఆయన సినిమాలకంటే పొలిటికల్ గానే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల పవన్ సినిమాల కంటే రాజకీయాల్లో సంచలనాలను సృష్టించాలని ఆయన అభిమానులు కొరుకుంటున్నారు.
అయితే చిరంజీవికి ఆ స్థాయి ఊరికే రాలేదు. దశాబ్దాల పాటు నంబర్ వన్ స్థానంలో కొనసాగడం సులువు కాదు. కనీసం పదేళ్ల పాటు నటన, కలెక్షన్లు, విమర్శలకు మెప్పు పొందే సత్తా ఉన్న హీరో ఎవరైనా ఉంటే ఆ లిస్టులో చిరంజీవి మాత్రమే అంటూ కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం ఎప్పటికీ చెక్కు చెదరని స్థానం అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం గమనార్హం.