Leo: లియో సినిమాలో నటించిన ఈ కుర్రాడు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

లియో సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ లాగా ఓ కుర్రాడు కనిపిస్తుంటాడు. కానీ కొంచెం సేపు స్క్రీన్ మీద ఉన్నా.. తన నటనతో అందరినీ భయపెట్టేసాడు. ఈయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్.

Written By: Suresh, Updated On : October 26, 2023 2:47 pm

Leo

Follow us on

Leo: దసరా సందర్బంగా ముగ్గురు స్టార్ హీరోలో బరిలో నిలిచారు. మూడు సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక తెలుగు హీరోలు ఇద్దరు. ఓ తమిళ సూపర్ స్టార్ కూడా ఈ సారి దసరా బరిలో ఉన్నారు. అదేనండి మన విజయ్ దళపతి. ఈ స్టార్ నటుడు లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ తోనే దూసుకొని పోయింది. ఖైదీ, విక్రమ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో హిట్ తో దూసుకొని పోయాయి. దీంతో తమిళ డైరెక్టర్ అయినా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించారు ఈ లోకేష్. అందుకే లియో సినిమా మంచి హిట్ టాక్ ను సంపాదించింది. మరి ఇందులో ఉన్న ఓ సైకో ఎవరో తెలుసా?

లియో సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ లాగా ఓ కుర్రాడు కనిపిస్తుంటాడు. కానీ కొంచెం సేపు స్క్రీన్ మీద ఉన్నా.. తన నటనతో అందరినీ భయపెట్టేసాడు. ఈయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్. ఈయన నటుడు కూడా. వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా పని చేస్తాడు. ఈయన 2005లో కలైంజర్ టీవీలో ప్రసారమైన డ్యాన్స్ షో మానాడ మయిలాడ సీజన్ 1 లో కొరియోగ్రాఫర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇదే షోలో విజేతగా కూడా నిలిచారు. ఆ తర్వాత ఇదే షోలో వివిధ సీజన్ లలో న్యాయనిర్ణేతల ప్యానెల్ లో కూడా పనిచేశాడు ఈ శాండీ.

2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వర్షన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మాస్టర్ గా పాపులర్ అయ్యారు శాండీ. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాకు కొరియోగ్రఫీ అందిస్తూ.. సినిమాల్లో నటించడం మొదలుచేశారు. ఇవనుకు తన్నిల గండం అనే సినిమాతో తన కెరీర్ ను మొదలు చేశారు ఈ కొరియోగ్రఫర్. ఎన్నో సినిమాల్లో కనిపించిన శాండీ లియో మూవీతో తన క్రేజ్ ను ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు. ఈయన నటన చూసిన చాలా మంది ఆశ్యర్యపోయారు కూడా. ఆయన సైకో పాత్రలో ఒదిగిపోయారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఈ సినిమా తర్వాత శాండీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.