Meenakshi Chaudhary ఆకట్టుకునే అందం, నటన ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉంటేనే మంచి పొజిషన్ లో ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. పోటీని తట్టుకొని నిలబడాలి. అందరికీ ఆ అదృష్టం వరించదు. కానీ ఎదురు చూస్తే తప్పకుండా విజయం అందుకోవచ్చు. ఇదిలా ఉంటే మీనాక్షి చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. కానీ ఈమె స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. ఇండస్ట్రీలో కొనసాగుతుంది కానీ.. అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించడం లేదు. కానీ ఆమెకు ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం అంతకు మించి రెమ్యూనరేషన్ అందుకోవడానికి సిద్దమైంది. ఆ వివరాలు మీకోసం…
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. వెబ్ సిరీస్ లు, సీరియల్స్ తో గుర్తింపు పొందిన ఈ అమ్మడు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. గతంలో అడవి శేషు హీరోగా వచ్చిన హిట్ 2లో నటించి వరుస ఆఫర్లు అందుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు కిలాడీ సినిమాలో కూడా నటించింది. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే చిన్న సినిమా నుంచి రవితేజ నటించిన కిలాడీ సినిమా వరకు తన రేంజ్ ను పెంచుకుంది. ఇప్పుడు కూడా మంచి ఆఫర్లే క్యూ కడుతున్నాయట.
తాజాగా మహేష్ బాబు హీరోగా రాబోతున్న గుంటూరు కారం లో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుని బంపర్ ఆఫర్ ని కొట్టేసింది మీనాక్షి. లేటెస్ట్ గా ఒక తమిళ సినిమాలో కూడా బంపర్ ఆఫర్ ని కొట్టేసింది. దళపతి విజయ్ లేటెస్ట్ గా లియో తో మంచి హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. అందుకోసం ఈ అమ్మడుకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఏకంగా రూ. 3 కోట్లు అందుకునే రేంజ్ కు వెళ్లింది.