Sukumar vs Prashanth Neel: ఆర్య (Aarya)సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా పరిచయమైన డైరెక్టర్ సుకుమార్ (Sukumar)…ఈయన తన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న సుకుమార్ పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ఇక పాన్ ఇండియాలో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన సినిమాగా ఈ సినిమా నిలవడం నిజంగా విశేషమనే చెప్పాలి. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేసిన ఈ సినిమా సుకుమార్ కి చాలా చక్కటి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే కేజీఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)… కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ తో చేసిన సలార్ (Salaar) సినిమాతో 800 కోట్ల వరకు కలెక్షన్ కొల్లగొట్టిన ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ప్రశాంత్ నీల్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సుకుమార్ – ప్రశాంత్ నీల్ మధ్య భీకరమైన పోటీ అయితే నడుస్తోంది.
Also Read: అనిల్ రావిపూడి సక్సెస్ ల వెనక కారణం ఏంటంటే..?
వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ పొజిషన్ ను అందుకుంటారు అనే విషయంలో పోటీ అయితే నడుస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడు టాప్ పొజిషన్ ఆక్రమించినప్పటికి తన తర్వాత పొజిషన్లో ఈ ఇద్దరిలో ఎవరు నిలుస్తున్నారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.
రాబోయే సినిమాలతో వీళ్లను వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే మాత్రం రాజమౌళిని సైతం బీట్ చేసి నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. సుకుమార్ లాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఆయన కూడా భారీ విజయాన్ని సాధించి నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read: రాజమౌళి తన సినిమాలకు కీరవాణిని తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఎందుకు తీసుకోడో తెలుసా.?
ఇక ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అని చెప్పడం చాలా కష్టం…ఎందుకంటే ఇద్దరిలో ఎవరికి వాళ్ళకి ఒక సెపరేట్ స్టైల్ ఉంది. వాళ్లు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి…