Anil Ravipudi Success: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నప్పటికి వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు చాలా మంచి క్రేజ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ వర్క్ చేస్తూ మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్న క్రమంలో కమర్షియల్ సినిమాలు రోజురోజుకి క్రేజ్ అయితే తగ్గిపోతోంది. కానీ స్టార్ హీరోలందరు కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… దర్శకులు కమర్షియల్ సినిమాల్లో కొంతవరకు వైవిధ్యాన్ని చూపించగలిగితే మాత్రం ఆ సినిమాలో సూపర్ హిట్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన చేసిన 8 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న తొమ్మిదోవ సినిమా కూడా సూపర్ హిట్ సాధిస్తే మూడో హ్యాట్రిక్ ను సైతం ఖాతాలో వేసుకున్న వాడు అవుతాడు. మరి ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి సక్సెస్ వెనకాల సీక్రెట్ ఏంటి అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం తెలుసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అనిల్ రావిపూడి ఒక రొటీన్ సినిమా స్టోరీని తీసుకునే దానికి విభిన్నమైన తరహాలో ట్రీట్మెంట్ ని జోడించి స్క్రీన్ మీద ఆ హీరోని ఎలివేట్ చేస్తూ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు.
Also Read: విడుదలకు ముందే ప్రభంజనం..అక్షారాలా 500 బెనిఫిట్ షోస్..’వార్ 2′ క్రేజ్ మామూలుగా లేదుగా!
అందువల్లే అతని సినిమాలకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ప్రేక్షకుల్లో కూడా ఆయన సినిమాల పట్ల కొంతవరకు మంచి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కొంత మంది అతని సినిమాలో క్రింజ్ కామెడీ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నప్పటికి ఆయన ఎప్పటికప్పుడు ఆ విమర్శలకు చెక్ పెడుతూ వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు…
ఇక పక్కా పర్ఫెక్ట్ కమర్షియల్ మీటర్ లో సినిమాలను చేస్తూ ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిజానికి ఆయన సినిమాల్లో కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా భారీగా ఉంటాయి. పర్ఫెక్ట్ టెంప్లేట్లో హీరోని ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది.
అందువల్లే ఆయన సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక కొత్తగా వచ్చే దర్శకులు సైతం కమర్షియల్ సినిమాలు చేయాలంటే అతని సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతూ మంచి సినిమాలు చేస్తే మాత్రం మంచి విజయాలను దక్కించుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…